భారత్ పై ఎప్పుడూ విమర్శలు గుప్తిస్తూ..ఏదో ఒక కీడు చేయాలని ఆలోచించే దాయాది దేశం పాకిస్థాన్ తన బుద్ది మాత్రం ఎప్పటికీ మార్చుకోనంటుంది.  ప్రపంచ దేశాలు భారత్ శాంత్రి మంత్రాన్ని కొనియాడుతూనే.. పాక్ కుటిల నీతిని ఎండగడుతున్నా ఆ దేశం మాత్రం తన తీరు మాచ్చుకోవడం లేదు.  దాయాది దేశంలో అణుబాంబుల మాదిరిగా ఉగ్రవాదులకు స్థానం కల్పిస్తూ భారత్ పై దాడులకు పురిగొల్పుతూనే ఉంది.  ఆ మద్య పుల్వామలో సైనిక వాహనంపై దాడి జరిపి నలభై మంది భారత సైనిక ముద్దు బిడ్డలను పొట్టన బెట్టుకున్నారు. అమరజవాన్ల కు నీరాజనంగా ప్రతీకార వాంఛతో రగిలిపోయిన భారత వాయుసేన సైన్యం పాక్ యుద్ద విమానలను తరిమి కొట్టింది. 


ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్‌ దాడి జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్‌-16ను అభినందన్‌ తన మిగ్‌ విమానంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో భారత యోధుడు..అభినందన్ శత్రువులను తరిమికొట్టి సమయంలో అనుకోకుండా శత్రు దేశం గడ్డపై కాలు మోపాడు. అక్కడి స్థానికులు అభినందన్ ని ఘోరంగా కొట్టారు, హింసించారు కానీ ఎక్కడ అదరలేదు,బెదరలేదు. అంతే కాదు తన వద్ద ఉన్న రహస్య పత్రాలను సైతం మింగేసి మిగిలిన వాటికి దగ్గరలోని నీటిలో ముంచారు. ఆ తర్వాత అభినందన్ ని పాక్‌ స్థానికకులు సైనికులకు అప్పగించారు. 


శత్రు సైనికుల చెరలో ఉన్నా చెరగని స్థైర్యం.. ప్రత్యర్థుల దాడితో రక్తం ధారలు కారుతున్నా సడలని ధైర్యం.. చావు కళ్లముందు కన్పిస్తున్నా తలవంచని మొక్కవోని ధైర్యంతో శత్రు సైనికాధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసినదే చెబుతాను..మిగతా విషయాలు చెప్పకూడదు అంటూ నిర్మోహమాటంగా చెప్పాడు. పాక్‌ సైనికులు ఎంత ఒత్తిడి చేసినా.. అభినందన్‌ మన సైన్యానికి సంబంధించిన రహస్యాలను వెల్లడించలేదు. మొత్తానికి దౌత్యంతో అభినందన్ క్షేమంగా భారత్ కి చేరుకున్నారు. అభినందన్ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు 'వీర్‌చక్ర' పురస్కారాన్ని ప్రదానం చేశారు. అయితే అభినందన్ ని పట్టుకునే క్రమంలో కీలక పాత్ర పోషించిన  పాక్‌ కమాండో అహ్మద్‌ ఖాన్‌ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడు.


అహ్మద్‌ ఖాన్‌ పాక్‌ సైన్యం ప్రత్యేక సేవా గ్రూప్‌లో సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. చొరబాటుదారులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో నాక్యాల్‌ సెక్టార్‌లో ఈ నెల 17న భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు.అభినందన్‌ పట్టుబడిన సందర్భంలో విడుదలైన ఫొటోల్లో అహ్మద్ ఖాన్‌ ఆయన వెనుకే ఉన్నాడు. భారత్‌ - పాక్‌ సరిహద్దులో పాక్‌ నుంచి ఉగ్రవాదులను భారత్‌కు అక్రమంగా తరలించేందుకు అహ్మద్‌ ఖాన్‌ కీలకంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది.  కాగా, ఉగ్రవాదులను ఉపయోగించి కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచేందుకు పాక్‌ రచించే వ్యూహాలను అతడు అమలు చేసేవాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: