ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వివాదాల పరంపరం కొనసాగుతునే ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రెండున్నర నెల‌లుగా కోడెల లేదా ఆయ‌న ఫ్యామిలీ స‌భ్యులు ప్ర‌తి రోజూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. దీనిని బ‌ట్టి ఐదేళ్ల పాటు టీడీపీ ప్ర‌భుత్వాన్ని అడ్డం పెట్టుకుని కోడెల కుమారుడు కోడెల శివ‌రాం ప్ర‌సాద్‌, కుమార్తె పూనాటి విజ‌య‌ల‌క్ష్మి ఏ రేంజులో దోపిడీ చేశారో.. ఎన్ని అక్ర‌మాలు చేశారో అర్థ‌మ‌వుతోంది.


ఇక ఈ వివాదాల ప‌రంప‌ర‌లో కోడెల ఏపీ అసెంబ్లీ ఫ‌ర్నిచ‌ర్‌ను సైతం త‌న ఇంటికి తీసుకువెళ్లిపోయార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వీటిని కోడెల సైతం అంగీక‌రించారు. తాను ఫ‌ర్నీచ‌ర్ తీసుకు వెళ్లిన మాట వాస్త‌వ‌మే అని అంగీక‌రించారు. దీంతో వైసీపీ వాళ్లు కోడెల‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. చివ‌ర‌కు టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య లాంటి వాళ్లు సైతం కోడెల తీరును త‌ప్పుప‌ట్టారు.


కోడెల శివప్రసాద్ ఫర్నీచర్ తీసుకుని వెళ్లడం.... ఇప్పుడు తిరిగి తీసుకుని వెళ్లండి అనడం కరెక్ట్ కాదన్నారు. అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శికి కూడా ఈ విషయాన్ని కొడెల ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఏదేమైనా ఈ విష‌యంలో కోడెల పార్టీ ప‌రువు తీశార‌ని కూడా వ‌ర్ల విమ‌ర్శించారు. తాజాగా తుళ్లూరు పోలీస్‌స్టేష‌న్లో అసెంబ్లీ సెక్ర‌ట‌రీ కోడెల‌పై ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ హైదరాబాద్ నుంచి అమరావతి తరలిస్తున్న సమయంలో కోడెల దారి మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఇదిలా ఉంటే కోడెల ఏయే ఫ‌ర్నీచ‌ర్ వ‌స్తువ‌ల‌ను త‌న ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్లిపోయారో.. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. 


ప్లాస్టిక్ చైర్స్- 27
బీఏసీ హాల్ చైర్స్- 8
డైనింగ్ హాల్ చైర్స్- 7
ఎగ్జిక్యూటివ్ చైర్స్- 2


సింగిల్ సీటర్ సోఫాలు- 3
త్రీ సీటర్ సోఫా- 1
డైనింగ్  టేబుల్- 1
బీఏసీ మీటిగ్ టేబుల్- 1
సెంటర్ టేబుల్- 1


చైర్స్- 5
విజిటర్స్ చైర్స్- 5
విజిటర్స్ చైర్స్ (పీకాక్ మోడల్)- 14
మెంబర్స్ లాండ్ చైర్స్- 80
మెంబర్స్ లాంజ్ ఉడెన్ చైర్స్- 10


మరింత సమాచారం తెలుసుకోండి: