ఖ‌డ్గ‌మృగం అంటే చాలా మంది లైట్ తీస్కొంటారు. మ‌న‌దేశంలో ఖ‌డ్గ మృగాలు అస్సాంలోని క‌జిరంగా నేష‌న‌ల్ పార్కులో ఎక్కువుగా ద‌ర్శ‌న‌మిస్తాయి. వీటికి ఆ పార్క్ చాలా ఫేమ‌స్‌. వాటికి కోపం వ‌స్తే ఎలా ఉంటుందో ?  తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌నే చెపుతుంది. ఖ‌డ్గ మృగం దెబ్బ‌తో ఆ ప‌ర్యాట‌కులు చావు అంచులు చివ‌రి వ‌ర‌కు వెళ్లి వ‌చ్చారు. తృటిలో చావును త‌ప్పించుకున్నారు.


ఖడ్గమృగం వెంటాడం ఎప్పుడైనా చూశారా ? టూరిస్టులపై ఎలా దూసుకొచ్చిందో ఇదిగో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ వీడియో చూడ‌డానికే వ‌ణుకు పుట్టించేలా ఉంది. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. సౌత్ అఫ్రికన్ సఫారీ పార్కులో ఈ ఘటన జరిగింది. సాధారణంగా సఫారీలో చిరుతలు, సింహాలు ఇతర క్రూర మృగాలు టూరిస్టులపై దాడికి యత్నించడం కామన్.


ఈ దాడుల‌తో కొంద‌రు టూరిస్టులు గ‌తంలో గాయ‌ప‌డిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీటికి భిన్నంగా ఇప్పుడు ఓ ఖ‌డ్గ‌మృగం  టూరిస్టు వ్యాన్‌ను వెంటాడి వెంటాడి వ‌దిలేసింది. ఈ మృగం దెబ్బ‌తో వారు చావు చివ‌రి అంచుల వ‌ర‌కు వెళ్లి వ‌చ్చారు. రియాన్ బోసోఫ్ అనే టూరిస్టు సఫారీ పార్కులో వీడియో షూట్ చేస్తూ వెళ్తున్నాడు. తన వాహనంలో ఉండి అక్కడి జంతువులను చూస్తూ వీడియో తీస్తున్నాడు. 


ఈ క్ర‌మంలోనే రియాన్‌కు ఓ తెల్లని ఖడ్గమృగం కనిపించింది. దాన్ని వీడియో తీశాడు. అంతే.. నన్ను వీడియో తీస్తావా? నీ సంగతి చూస్తానంటూ టూరిస్టు వాహనం వెంట పరిగెత్తింది. దాదాపు చాలాదూరం టూరిస్టును ఖడ్గమృగం వేగంగా తరిమింది. కనీసం రెండు నిమిషాల పాటు వెంటాడింది.. వాహనానికి అతి దగ్గరకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించింది.


ఆ వ్యాన్లో ఉన్న వారు సైతం బ‌తుకు జీవుడా అని ఎట్ట‌కేల‌కు బ‌య‌ట‌ప‌డ్డారు. వాహ‌నం స్పీడ్ పెంచ‌డంతో అది ప‌రిగెత్త‌లేక‌పోయింది. రెండో అతిపెద్ద జంతువులైన తెల్లని రెయినోలు గంటకు 30 మైళ్లు వేగంగా పరిగెత్తగలవు. వైరల్ అవుతున్న వీడియో ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి: