వైకాపా నేత విజయసాయి రెడ్డి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఈ నేత ఢిల్లీలో వైకాపాకు సంబంధించిన ముఖ్య విషయాల గురించి చూసుకుంటున్నారు.  అయితే, విజయసాయి రెడ్డి టూర్ కు సంబంధించిన విషయాలు చూసుకోవడమే కాకుండా... ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీనుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా ఆయనే నేతలతో సమావేశాలు జరుపుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ వైకాపాలో వైఎస్ జగన్ తరువాత విజయసాయి రెడ్డి కీలక నేతగా ఎదిగారు.  


పార్టీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నా.. ప్రభుత్వంలో కీలక విషయాలపై చర్చలు జరపాలి అన్నా విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుంది.  గత కొంతకాలంగా విజయసాయి రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వైసిపిని చిక్కుల్లో పడేస్తున్నాయి.  అందుకే ఈ నిర్ణయాల కారణంగా వైకాపా తన పరిమితిని కోల్పోతున్నది.  


అందుకు ఓ ఉదాహరణ వైఎస్ జగన్ యూఎస్ టూర్.  యూఎస్ టూర్ లో జరిగిన విషయాలు వైకాపా పరువును పోగొట్టాయి.  ముందుగా అనుకున్నట్టుగా ప్రముఖులను వేదికమీదకు పిలవకుండా అప్పటికప్పుడు మొత్తం ప్రోగ్రామ్ చేంజ్ చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  విజయసాయి రెడ్డి ఆరెంజ్ చేసిన ఐదుగురు ఆర్గనైజర్లు వెళ్లారట.  అయితే, అక్కడికి వెళ్ళాక.. అంతా మారిపోయింది.  


దీంతో పాటు ఏ విషయం అయినా సరే.. మోడీ, అమిత్ షా తో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటానని చెప్పడం వెనుక చాలా అర్ధం ఉందని అనుకోవచ్చు.  త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగాలని చూస్తోంది.  ఏపీ లో వైకాపా బలంగా ఉన్నది.  బలంగా ఉన్న పార్టీతో దోస్తీ చేస్తే ఆ తరువాత ఎన్నికల సమయానికి ఎదిగే అవకాశం ఉంటుంది.  ఇక్కడ మరో విషయం కూడా వార్తల్లో వినిపిస్తోంది.  వైకాపా త్వరలోనే ఎన్డీయేలో కలిసిపోతుందని అంటున్నారు.  అయితే, ఒకవేళ వైకాపాఎన్డీయే లో కలిస్తే విజయసాయి రెడ్డికి కేంద్రమంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. లేదు.. వైకాపానుంచి బయటకు వస్తే బీజేపీలో జాయిన్ అయితే.. మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: