ఇటీవల కాలంలో విడాకులు కేసులు అత్యధికంగా పెరిగిపోయాయి.  ప్రతి చిన్న విషయానికి కూడా అలిగి గోలచేసి నానాయాగీ చేసుకుంటూ కోర్టుకు వెళ్తున్నారు.  విడాకులు తీసుకుంటున్నారు.  కూరలో ఉప్పు ఎక్కువైందని.. రిమోట్ అడిగితె ఇవ్వలేదని.. చెప్పిన పని చేయలేదని.. ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని ఇలా నానా రకాల విషయాలతో విడాకులు తీసుకుంటున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు.  


దీనికి కారణం ఏంటి.. ఆర్ధిక స్వతంత్రత.  ఆడవాళ్లు.. మగవాళ్ళు ఇద్దరు ఆర్థికంగా బలంగా ఉన్నారు.  ఇద్దరు సంపాదిస్తున్నారు.  దీంతో ఇద్దరికి డబ్బులు వస్తున్నాయి.  ఒకరి అవసరం లేకుండానే బ్రతుకు నెట్టుకొస్తున్నారు.  ఇది వాళ్లకు అర్ధంకాని ప్రశ్న.  విడాకులకు కోర్టుకు వెళ్లే ప్రతి కేసు దాదాపుగా ఇలానే ఉంటుంది.  కానీ, ఓ కేసు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నది.  అదేమంటే.. 


భర్త ఆమెను అతిగా ప్రేమిస్తున్నాడట.  భార్యను కూర్చోపెట్టి అన్ని పనులు చేస్తున్నాడు.  ఇంట్లో ప్రతి పని చేస్తూ.. ఇబ్బంది పెట్టకుండా చూస్తున్నాడు.  భోజనం బాగాలేకపోయినా ఏమి అనడు.. అవసరమైతే తానె వండి పెడతాడు.  ఇంటిలో అన్ని పనులు చేస్తూ చివరకు భార్యకు కాళ్ళు కూడా పడతాడట. వీరి కేసును విన్న జడ్జి షాక్ అయ్యాడు.  ఎవరైనా తిట్టుకుంటే కొట్టుకుంటే అభిప్రాయం భేదాలు వస్తే విడాకుల కోసం వస్తారు.. ఇలా అతిప్రేమ చూపిస్తున్నాడని కోర్టుకు వచ్చిన కేసు కావడం దానికి చట్టంలో ఎలాంటి తీర్పు చెప్పాలో తెలియక తికమట పడ్డాడట.  


భర్తను ఈ విషయం గురించి అడిగితె.. తనకు భార్య అంటే అత్యంత ఇష్టం అని... భార్యను కష్టపెట్టడం లేదని, తాను లావుగా ఉన్నానని చెప్పినపుడు కష్టపడి.. డైటింగ్ చేసి లావు తగ్గానని, తన భార్యతో గొడవపడలేనని అన్నాడట.  భార్య మాత్రం.. తనకు తన భర్తతో దెబ్బలాడని, పోట్లాడాలని, తిట్టుకోవాలని ఉంటుందని కానీ అయన అతి ప్రేమ వలన అది చేయలేకపోతున్నానని, తనకు అలాంటి భర్త వద్దని చెప్పి చెప్పింది.  అయితే, ఇది కోర్టులో తేలే విషయం కాదని, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని తీసుకోవలసిన నిర్ణయం అని చెప్పి కేసును కొట్టేశారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: