ఎన్నికల ఫలితాల తర్వాత  కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేసీఆర్ కట్టబెట్టగా  ప్రస్తుతం పార్టీ వ్యవహరాల ను కేటీఆర్ చూస్తున్నారు.హరీష్ రావు మెదక్ జిల్లాకు మాత్రం పరిమితమయ్యాడు.ఇక దసరా తర్వాత కేసీఆర్ తన కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.అయితే మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్, హరీష్‌ లకు చోటు దక్కుతుందా లేదా లేక ఇద్దరిలో ఒక్కరికే చోటు దక్కే అవకాశం ఉందా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెల కొంది. కేసీఆర్ తన మంత్రివర్గంలోకి ఇంకా ఆరుగురిని తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఆ ఆరుగురిలో ఎవరికి చోటు దక్కుతోందనే విషయ మై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది.గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 26 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు.అయినా కాని పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానానికి మాత్రమే హరీష్ రావు పరిమితమయ్యారు.ఈ నేపధ్యంలో హరీష్ ను పక్కకు పెడుతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది.అయితే ఈ ప్రచారాన్ని హరీష్ ఖండించారు.



ఈ దఫా ఇద్దరికి కేబినెట్ లో చోటు కల్పిస్తారా లేక ఒక్కరికే చోటు దక్కుతోందా అనే చర్చ కూడ లేకపోలేదు.అందువల్ల కేసీఆర్ కేబినెట్ లో హరీష్ రావుకు చోటు దక్కకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ ఉంది.ఇక కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి,మరో వైపు గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందట.మరో వైపు ఎస్టీ మహిళ, మున్నూరు కాపు,కమ్మ సామాజిక వర్గాలకు కూడ కేబినెట్ లో చోటు కల్పించాల్సి ఉండగా,వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉందంటున్నారు.గత కేబినెట్ లో వెలమ సామాజిక వర్గం నుండి కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు,జూపల్లి కృష్ణారావులు ఉండగా.ఈ దఫా మాత్రం కేసీఆర్ తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రమే ఉన్నారు.ఇకపోతే సుఖేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డికి కేబినెట్ లో చోటు దక్కాలంటే ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు మంత్రుల్లో ఇద్దరిని తప్పించాల్సిన పరిస్థితి కనిపిస్తుందట,కేసీఆర్ కు..



ఐతే ఇదివరకే కేబినెట్ లో నలుగురు కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.ఆ నలుగురిలో హరీశ్ రావు, కేటీఆర్ కూడా ఉన్నట్టు తెలిసింది.వీరితో పాటు సబితా ఇంద్రారెడ్డి,తుమ్మల నాగేశ్వరరావును కూడా రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: