Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 10:45 am IST

Menu &Sections

Search

వైసీపీలో ట్ర‌బుల్ షూట‌ర్ల ట్ర‌బుల్స్‌... చిక్కుల్లో పార్టీ

వైసీపీలో ట్ర‌బుల్ షూట‌ర్ల ట్ర‌బుల్స్‌... చిక్కుల్లో పార్టీ
వైసీపీలో ట్ర‌బుల్ షూట‌ర్ల ట్ర‌బుల్స్‌... చిక్కుల్లో పార్టీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో ఎట్ట‌కేల‌కు అధికారంలోకి వ‌చ్చిన వైసీపీలో అల‌జ‌డి ప్రారంభ‌మైంది! ప‌ట్టుమ‌ని జ‌గ‌న్ పాల‌నకు 100 రోజులు కూడా నిండ కుండానే అటు  కేంద్రం నుంచి ఇటు రాష్ట్రంలోని విప‌క్షాల నుంచి కూడా తీవ్ర‌స్థాయిలోవిమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ తీసుకుంటు న్న నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించేవారు.. త‌ప్పుబ‌ట్టేవారు, స‌వాలు చేసేవారు కూడా ఎక్కువ‌య్యారు. ముఖ్యంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మై న పోల‌వ‌రం, రాజ‌ధాని నిర్మాణం, పీపీఏలు, ఒప్పందాల పునః స‌మీక్ష‌, రివ‌ర్స్ టెండ‌రింగ్ వంటి కీల‌క నిర్ణ‌యాల‌పై ఇంటా బ‌య‌టా స‌హా అంత‌ర్జాతీయంగా కూడా తీవ్ర విమ‌ర్శ‌నాస్త్రాలు ఎదుర‌వుతున్నాయి. 


అది కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ రాష్ట్రంలో లేని స‌మ‌యంలో, ఆయ‌న అమెరికాకు వెళ్లిన స‌మ‌యంలో ఇలాంటి వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు రావ‌డం పార్టీని, ప్ర‌భుత్వాన్ని కూడా అయోమ‌య స్థితికి నెడుతోంది. అదే స‌మ‌యంలో అన్న క్యాంటీన్ల తొల‌గింపు, తెల్ల రేష‌న్ కార్డుదారుల‌కు ప‌ల్స్ స‌ర్వే పేరుతో లింకు పెట్టి కార్యాల‌యాల చుట్టూ తిప్ప‌డం, ఇసుక విధానాన్ని ప్ర‌క‌టించ‌కుండా తాత్సారం చేయ‌డం వంటివి నిజంగానే ప్ర‌జ‌ల్లోనూ ఒకింత ప్ర‌భుత్వంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసేలా చేస్తున్నాయి. ఇక‌, యాదృచ్ఛికంగా జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలోనే రాష్ట్రంలో రెండు న‌దులు గోదావ‌రి, కృష్ణాలు ఉప్పొంగాయి. ఫ‌లితంగా జిల్లాల‌కు జిల్లాలు మునిగిపోయాయి. 


దీంతో రాష్ట్రంలోని ప్ర‌ధాన విప‌క్షం టీడీపీ స‌హా బీజేపీ నేత‌లు ఉక్క ఉదుటున జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ముఖ్యంగా జ‌గ‌న్ రాష్ట్రంలో లేని స‌మ‌యంలో విప‌క్ష నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టే నాయ‌కులు వైసీపీలో ఏ ఒక్క‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి టీడీపీ క‌న్నా కూడా వైసీపీలోనే ఫైర్ బ్రాండ్ నాయ‌కులు ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షాన్ని ఒక్క బిగిన ఇరుకున పెట్టిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. అయితే, ఇప్పుడు కీల‌క‌మైన స‌మ‌యంలో అందునా జ‌గ‌న్ రాష్ట్రంలో లేని స‌మ‌యంలో వీరంతా ఏం చేస్తున్నార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. 


ఒక్క‌రంటే ఒక్క‌రూ ప్ర‌తిప‌క్షాల‌కు కానీ, కేంద్రానికి కానీ జ‌వాబు ఇచ్చిన  ప‌రిస్తితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, రోజా, అంబ‌టి రాంబాబు, వాసిరెడ్డి ప‌ద్మ, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వంటి వారు ఏపీలోనే ఉన్నా.. ఏ ఒక్క రూ కూడా జ‌గ‌న్‌పై జ‌రుగుతున్న దాడిని ఖండించిన పాపాన పోలేదు. పైగా ఎదురు దాడి కూడా చేయ‌లేక పోయారు. దీంతో ఇదే అవ‌కాశం అని భావించిన ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై ఏక‌ధాటిగా విమ‌ర్శ‌లు గుప్పించాయి. 


ట్ర‌బుల్ షూట‌ర్లు ఇలా.. వ్య‌వ‌హ‌రిస్తే.. ఇక‌, కేంద్రంలో కీల‌కంగా చ‌క్రం తిప్పుతున్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌యసాయి రెడ్డి, రాష్ట్రంలో చ‌క్రం తిప్పుతున్న బొత్స స‌త్య‌నారాయ‌ణ వంటివారు జారిన మాట‌లు మంటలు రేపాయి. రివ‌ర్స్ టెండ‌రింగ్ స‌హా న‌వ‌యుగ సంస్థ‌ను పోల‌వ‌రం నుంచి త‌ప్పించ‌డం వెనుక త‌మ పాత్రే కాద‌ని, కేంద్రానికి, ప్ర‌ధాని కార్యాల‌యానికి అన్నీ చెప్పి చేశామంటూ.. విజ‌య‌సాయి చెప్పిన మాట‌.. రాజ‌కీయంగా దుమారం రేపింది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ రెచ్చిపోయింది. దీనిపై పీఎంవో ఏకంగా వివ‌ర‌ణ కోరిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇదే విష‌యంపై ప్ర‌ధాని కూడా ఆరా తీసిన‌ట్టు స‌మాచారం. 


మ‌రోప‌క్క‌, రాజ‌ధాని విష‌యంపై అక్క‌డ వ‌ర‌ద నేల‌ల‌ని, ల‌క్ష ఖ‌ర్చ‌య్యే ప‌నికి రెండు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని, ఇలాంటి చోట రాజ‌ధానా? అంటూ బొత్స చేసిన న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపాయి. ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్షాల దాడికి దీటైన స‌మాధానం ఇవ్వ‌లేక స‌త‌మ‌త‌మైన సంద‌ర్భంలో పార్టీలోని కీల‌క నేత‌లే ఇలా వ్యాఖ్యానించి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడితే.. ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. దీనిపై జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో ఒక‌టి రెండు రోజుల్లో చూడాలి.


ycp-troubleshooters-in-troubles
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీలో మ‌రో తెలంగాణ ప‌థ‌కం..
ఆ ఎన్నికల‌ పేరెత్తితేనే జ‌గ‌న్‌లో టెన్ష‌న్ ఎందుకు..?
మంత్రిగా అనిల్ ఆరంగ్రేటం ఎలా ఉంది... హిట్టా... ఫ‌ట్టా..!
ఆ ప‌త్రిక అత్యుత్సాహం.. జ‌గ‌న్‌తో ర‌గ‌డ వెన‌క అస‌లు గుట్టు ఇదే...
టీడీపీలో ఆ ముగ్గురు నేతల అడ్రెస్ ఎక్కడ..!
ప్ర‌మాదం ఒక్క‌టే.,. కానీ, పాలకుల కోణంలోనే తేడా..!
డిగ్గీరాజా కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌: దేశంలో అత్యాచారాల‌కు వాళ్లే కార‌ణం.
టాలీవుడ్ టాప్ హిట్స్‌: ఫ‌స్ట్ వీక్ బాక్స్ బ‌ద్ద‌లు కొట్టిన సినిమాలు
టీడీపీ ప‌రువు తీస్తోందెవ‌రు...!
' వాల్మీకి ' ప్రి రిలీజ్ బిజినెస్‌.. వ‌రుణ్ టార్గెట్ ఎంతంటే...
' గ్యాంగ్ లీడ‌ర్ ' 4 డేస్ క‌లెక్ష‌న్స్‌.. ట్రేడ్‌లో టెన్ష‌న్ స్టార్ట్‌
బ్రేకింగ్‌: టీటీడీ పాల‌క‌మండలి ఖరారు.. న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఛాన్స్‌
బీజేపీతో శివ‌సేన బ్రేక‌ప్‌... మా దారి మాదే..!
' కోడెల‌కు బాబు నో అపాయింట్‌మెంట్‌ '
బీజేపీలోకి మాజీ మంత్రి... ఆ పార్టీకి మ‌రో షాక్‌..
టీడీపీ మాఫియాకు గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే స‌పోర్ట్‌..!
మ‌హారాష్ట్ర‌లో కుదిరిన పొత్తు... సీట్ల డీల్ ఇదే
ఆ తెలంగాణ ఫైర్‌బ్రాండ్ చూపు క‌మ‌లం వైపు..?
కోడెల మరణంతోనైనా... ఆ నేతలకు జ్ఞానోదయం అవుతుందా..!
టీడీపీ త‌మ్ముళ్ల‌ రీచార్జ్ ... ఈ ఉత్సాహం వెన‌క రీజ‌న్ ఇదే..!
మంత్రిగా పేర్ని నానికి ఎన్ని మార్కులు... స‌క్సెస్ అయిన‌ట్టేనా..!
న‌ల్ల‌మ‌ల‌పై తెలంగాణ అసెంబ్లీలో అదిరే ట్విస్ట్‌...
' కోడెల ' మ‌రణంపైనా రాజ‌కీయాలేనా బాబూ.... ఇదేం పద్ధ‌తో మ‌రి..!
తెలుగు రాజ‌కీయాల‌పై కోడెల మార్క్ ముద్ర‌... టీడీపీలోకి ఎలా వెళ్లారంటే...
సొంతపార్టీనే ఛీ కొట్టడాన్ని కోడెల జీర్ణించుకోలేక పోయారా...?
ఒక‌డు పోయాడు.... నేడు కూడా చావ‌నా.... కోడెల‌కు కుమారుడి బెదిరింపులు
కోడెల‌కు త‌ప్ప‌ని బాబు యూజ్ & త్రో పోటు.. బాబు చేతిలో అవ‌మానాలు..
కోడెల ఇంట్లో నిన్న రాత్రి ఏం జ‌రిగింది.. కొడుకుతో గొడ‌వ వెన‌క‌
బాబుతో కోడెల బంధం.. టీడీపీ హిస్ట‌రీలో ఓ చాప్ట‌ర్‌
కోడెల సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం (1982 - 2019 )
గోదావ‌రి ప్ర‌మాదం: లాంచీ జాడ దొరికింది... ఎక్క‌డ ఉందంటే...
పాక్ ముక్క‌లు కాక త‌ప్ప‌దా...!
క‌చ్చ‌లూరు ప్ర‌మాదాలకు డేంజ‌ర్ జోన్‌... రీజ‌న్ ఇదే..
వైసీపీలో జూనియ‌ర్ మంత్రి వర్సెస్ సీనియ‌ర్ ఎమ్మెల్యే
వైసీపీలో కొత్త పంచాయితీ... జ‌గ‌న్ తీర్పు ఏంటో..!
బీజేపీ ట్రాప్‌లో ఇద్ద‌రు వైసీపీ ఎంపీలు.. వీళ్లేనా..!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.