తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌తో సెంట రాఫ్‌ది న్యూస్‌గా మారిపోయారు. న‌ల్ల‌గొండ జిల్లా రాజ‌కీయాల్లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌గా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన వెంక‌ట‌రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డిలు పాలిటిక్స్‌లో కీల‌క నాయ‌కులుగా మారారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ప‌టి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌కు అత్యంత స‌న్నిహిత నాయ‌కులుగా మెలిగిన వీరిద్ద‌రు తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత జిల్లా, రాష్ట్ర రాజ‌కీయాల‌ను కూడా త‌మ‌వైపు తిప్పుకొనేందుకు నానా ప్ర‌యాస‌ప‌డ్డారు. 


2016-17 మ‌ధ్య కాలంలో రాష్ట్ర పీసీసీ పీఠం కోసం వెంక‌ట‌రెడ్డి చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఏకంగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డితోనే వైరానికి సై అన్నారు. నిత్య వివాదాలు, సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా మారారు. ఇక‌, గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓట‌మి పాలైన త‌ర్వాత‌.. మ‌రింత‌గా వెంక ట రెడ్డి రాష్ట్ర పార్టీ నాయ‌కుల‌పై కారాలు మిరియాలు నూరారు. పార్టీకి ద‌శ దిశ లేక పోవ‌డం తోనే కేసీఆర్‌ను ఓడించ‌లేక పోయా మంటూ మాట‌ల మంట‌లు రేపారు. 


ఇక‌, నిత్యం అధికార పార్టీ స‌హా సీఎం కేసీఆర్‌పై త‌న‌దైన శైలిలో కోమ‌టిరెడ్డి విరుచుకుప‌డు తూ.. మీడియా దృష్టిని ఆక‌ర్షించారు. తాజాగా ఆయ‌న పాద‌యాత్ర చేస్తానంటూ.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డంతో మ‌రోసారి ఆయ‌న మీడియా దృష్టిలో ప‌డ్డారు. దీనికి సంబంధించి కోమ‌టిరెడ్డి పెద్ద వ్యూహం సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తోంది. పైకి మాత్ర ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ని చెబుతున్నా.. పాద‌యాత్ర వెనుక వేరే రీజ‌న్ ఉంద‌ని అంటున్నారు. 


ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈనెల‌ 26 నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం, శ్రీశైలం సొరంగ మార్గం, పిల్లాయిపల్లి, బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలన్నది కోమటిరెడ్డి డిమాండ్. అందుకే ఈనెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల నుంచి హైదరాబాద్‌లోని జల సౌధ వరకు, వంద కిలో మీటర్లు పాదయాత్ర చేస్తానని ప్ర‌క‌టించారు. 


నిజానికి వెంకటరెడ్డి, 2018 ఎన్నికలకు ముందే జిల్లాతోపాటు, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి పాదయాత్ర చేస్తానన్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇవ్వలేదని స్వయంగా ఆయనే వెల్లడించారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయ‌న చాలా సీరియ‌స్‌గా పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాంగ్రెస్ నుంచి నేత‌ల‌ను అటు బీజేపీ, ఇటు అధికార టీఆర్ ఎస్ కూడా గుంజుకుంటున్న నేప‌థ్యంలో ఈయ‌న‌కు ఎవ‌రూ స‌హ‌క‌రించే ప‌రిస్తితి లేదు. అనుమ‌తులు కూడా ల‌భించే ప‌రిస్థితి లేదు. దీంతో అవ‌స‌ర‌మైతే.. కోర్టును ఆశ్ర‌యించైనా.. పాద‌యాత్ర చేస్తాన‌ని చెప్పారు. 


అయితే, ఇంత ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగ‌డం వెనుక ప్ర‌ధాన రీజ‌న్‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి తో కునారిల్లిన కాంగ్రెస్‌లో జ‌వ‌స‌త్వాలు నింప‌డంతోపాటు.. రాష్ట్ర నేత‌ల్లో ప్ర‌త్యామ్నాయ నేత‌గా ఎదిగేందుకు త‌న‌కు అవ‌కాశాన్ని తానే సృష్టించుకోవ‌డం వెంక‌ట రెడ్డి వ్యూహం గా క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో రేపో మాపో.. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎంపిక‌లు కూడా జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ప‌ద‌విపై ఎప్ప‌టి నుంచో ఆశ‌లు పెట్టుకున్న వెంక‌టి రెడ్డి దానిని కైవసం చేసుకునే రేంజ్‌కు ఎద‌గ‌డం ప్ర‌ధాన ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. కుదిరితే క‌ప్పు కాఫీ.. అన్న‌ట్టుగా వెంక‌ట రెడ్డి కొండ‌కు గేలం వేస్తున్నారు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: