గత కొన్ని రోజుల నుండి ఆధార్, ఈకేవైసీ నమోదు చేసుకోవాలని నమోదు చేసుకోకపోతే రేషన్ రాదని ఇతర సంక్షేమ పథకాలకు ప్రజలు దూరమవుతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆధార్, ఈకేవైసీ నమోదు విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఆధార్, ఈకేవైసీ నమోదుకు ఎలాంటి గడువు లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ ప్రజలకు ఈ విషయం గురించి స్పష్టతనిచ్చారు. ఆధార్ అప్ డేట్ నిదానంగా చేయించుకున్నప్పటికీ ఎటువంటి సమస్య ఉండదని కోన శశిధర్ చెప్పారు. ఆధార్, ఈకేవైసీ అప్ డేట్ చేయించుకోనప్పటికీ రేషన్ ఇవ్వటం జరుగుతుందని రేషన్ ఇవ్వరని వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని కోన శశిధర్ చెప్పారు. ఈకేవైసీ నమోదుకు ఎలాంటి గడువు లేదని కోనశశిధర్ స్పష్టతనిచ్చారు. 
 
బడికి వెళ్ళే పిల్లల ఆధార్, ఈకేవైసీ వివరాల కోసం పోస్టాఫీసులు, మీసేవా కేంద్రాలు, ఆధార్ కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదని కోన శశిధర్ స్పష్టతనిచ్చారు. ప్రభుత్వం పంపే ప్రత్యేక బృందాల ద్వారా పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలలో ఆధార్ వివరాలను అప్ డేట్ చేయించుకోవచ్చని చెప్పారు. గతంలో ఎప్పుడైనా రేషన్ షాపులో ఈకేవైసీ నమోదు చేసుకొని ఉంటే మరలా నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదని కోన శశిధర్ అన్నారు. 
 
మంత్రి కొడాలి నాని ఈ విషయం గురించి ప్రజలకు స్పష్టతనిచ్చారు. రేషన్ కార్డులోని సభ్యులు ఈకేవైసీ ఎప్పుడైనా నమోదు చేయించుకోవచ్చని ప్రజలు ఈ విషయం గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని కొడాలి నాని స్పష్టం చేసారు. ఈకేవైసీ చేయనంత మాత్రాన రేషన్ ఆపేస్తారని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని కొడాలినాని అన్నారు. కుటుంబసభ్యుల్లో ఒక్కరికీ ఈకేవైసీ ఉన్నా రేషన్ సరుకులు ఇస్తామని కొడాలి నాని అన్నారు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: