తిరుపతి వెళ్తున్నారు అంటే అక్కడి నుంచి తిరుపతి లడ్డు తీసుకురాకుండా ఉండరు.  తిరుపతి లడ్డుకు మంచి పేరు ఉన్నది.  అందుకే తిరుపతి లడ్డును ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు.  తిరుపతి లడ్డుకోసం పోటీపడుతుంటారు.  అంతకు ముందు కొన్ని మాత్రమే దొరికేవి.  కానీ, ఇప్పుడు అలా కాదు, భక్తులకు సౌకర్యం కోసం ఎన్ని లడ్డులు కావాలంటే అన్ని ఇస్తున్నారు.  అలా తీసుకున్న లడ్డులను హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చి అందరికి పంచిపెడుతుంటారు.  


తిరుపతి లడ్డు ప్రసాదం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పక్కర్లేదు.  ఈ లడ్డుకు జిఐ మార్క్ కూడా వచ్చింది.  ఈ లడ్డును మరొకరు తయారు చేయడానికి వీలు ఉండదు.  రోజుకు లక్షాలాది లడ్డులు అక్కడ తయారవుతుంటాయి.  అయితే, తిరుపతి లడ్డు ప్రసాదం వితరణ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యింది అనే విషయంపై అనేక మంది అనేకరకాల సమాధానాలు చెప్తుంటారు.  తిరుపతి లడ్డులు 1940 ప్రాంతంలో వితరణ చేయడం మొదలుపెట్టారని కొందరు చెప్తుంటారు.  


కానీ, తిరుపతి లడ్డు ప్రసాదం వితరణ కార్యక్రమం ఇప్పటిది కాదు.. మూడు శతాబ్దాలుగా తిరుపతి లడ్డును వితరణగా పంచిపెడుతున్నారని సమాచారం.  ఇలా ఈ లడ్డూల వితరణ ప్రారంభమయ్యి దాదాపు 304 సంవత్సరాల అయినట్టు ప్రాధమికంగా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.  ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది.. ఎంతవరకు అబద్దం అన్నది పక్కన పెడితే.. లడ్డూల ప్రసారం మాత్రం ఇప్పటి కాదు అన్నది స్పష్టంగా తెలుస్తోంది.  


ఇటీవలే ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.  ఈ లడ్డూ ప్రసాదం 1715 ఆగస్ట్ 2 నుంచి పంపిణ జరుగుతుందని కొందరు అంటున్నారు.  ఎందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సిన అంశం.  తిరుమలలో రోజు రోజుకు రద్దీ కూడా పెరిగిపోతున్నది.  అందుకే అక్కడ వసతి సౌకర్యాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.  ఎన్నో మార్పులను చేపట్టింది కూడా. 


మరింత సమాచారం తెలుసుకోండి: