వాతావరణం మారింది.. నగరంలో మార్పులు వచ్చాయి.  మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన జనాలు.. వర్షాలు కురిసి.. చల్లబడటంతో హ్యాపీగా ఉంటున్నారు.  అయితే, ఈ హ్యాపీ వెనుక విషాదం కూడా కనిపిస్తోంది.  అదేమంటే.. రాజధాని నగరంలో గత కొంతకాలంగా కొన్ని రకాల వ్యాధులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. దాదాపు కనుమరుగైపోయింది అనుకున్న కుష్టు వ్యాధి తిరిగి ప్రబలుతున్నది.  


ఇప్పటికే దాదాపు 50 వేలకు పైగా ఇలాంటి కేసులను గుర్తించారు.  సత్వర వైద్యం ఆడించేందుకు వైద్యశాఖ రెడీ అవుతున్నది.  కుష్టు అన్నది అంటువ్యాధి కావడంతో ప్రభుత్వం భయపడుతోంది.  ప్రభుత్వానికి ఇదొక పెద్ద సవాల్ అని చెప్పాలి.  కుష్టు వ్యాధి వలన మనిషి జీవితం ఎంత దుర్భరంగా మారుతుందో చెప్పక్కర్లేదు.  ఈ కుష్టు తో పాటు మరో వ్యాధి కూడా చాపకింద నీరులా వ్యాపిస్తున్నది.  


అదే క్షయ వ్యాధి.  వానాకాలం మొదలు కావడంతో.. ఈ వ్యాధి తిరిగి ప్రభలుతున్నది.  ఇప్పటికే నగరంలో 27వేలకు పైగా కేసులను గుర్తించారు.  సత్వర చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నది ప్రభుత్వం.  నాలుగు వరాల నుంచి తగ్గని దగ్గు, బరువు తగ్గడం, జ్వరం వంటివి వస్తుండటం చేస్తుంటే.. అది తప్పకుండా క్షయవ్యాధి అనే అనుకోవచ్చు.  


ఇది అంటువ్యాధి కావడంతో గుంపులుగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.  ఈ వ్యాధితో బాధపడే వారికీ చికిత్స ఉన్నది.  వీలైనంత త్వరగా గుర్తించి.. వారికి ట్రీట్మెంట్ ఇస్తే క్షయ వ్యాధి నయం అవుతుంది.  అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే.. దాని వలన మొదటికే మోసం వస్తుంది అంటున్నారు వైద్యనిపుణులు.  ప్రజారోగ్యం విషయంలో ఓ అడుగు ముందు వేసి.. స్వచ్చంద సేవకులను ఇంటింటికి పంపి వారి ఆరోగ్యం గురించిన వివరాలను సర్వే చేయించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం అయినట్టు తెలుస్తోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: