ఇప్పటికే ప్రపంచపటంలో హైదరాబాద్ కు ఓ మంచి గుర్తింపు ఉన్నది.  హైటెక్ సిటీ అభివృద్ధి చెందిన తరువాత అంతర్జాతీయ టెక్ కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయి.  పెట్టుబడులు పెడుతున్నాయి.  సంస్థలు స్థాపిస్తున్నాయి.  ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.  ఇందులో భాగంగానే ఇటీవలే అమెజాన్ సంస్థ ఓ భారీ నిర్మాణాన్ని ఆవిష్కరించింది.  


అమెరికా తరువాత ఆ స్థాయిలో నిర్మించిన నిర్మాణం హైద్రాబాద్లోనే కావడం విశేషం.  దీని ద్వారా అమెజాన్ సంస్థ దాదాపు 10వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది.  ఇప్పుడు హైదరాబాద్ లో మరో ప్రపంచస్థాయి కట్టడాలను నిర్మించేందుకు డ్రాగన్ దేశం చైనా ముందుకు వచ్చింది.  హైదరాబాద్ లోని కోకాపేట పరిసర ప్రాంతంలో 66 అంతస్థుల భవనాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది.  దాదాపు 1800 కోట్ల రూపాయలను ఇందుకోసం పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధం అయ్యింది.  


ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఎందుకు ఆస్థాయి కట్టడాలు నిర్మించేందుకు చైనా చూస్తున్నదో అర్ధం కావడం లేదు. ఇండియాతో చైనాకు ఎప్పటి నుంచో శత్రుత్వం ఉన్నది.  పైగా ఇండియా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా మారింది.  ఆర్ధికంగా చైనాతో పోటీ పడేందుకు సిద్ధం అయ్యింది. చైనా ఇంకా బలంగా మారాలి అంటే.. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలి. 

దానికి అనువైన ప్రాంతం హైదరాబాద్.. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి నిర్మాణాలు నిర్మిస్తే.. దానిపై పట్టుసాధించే అవకాశం దొరుకుతుంది.  ఫలితంగా స్థానికంగా ప్రభుత్వాన్ని దగ్గర చేసుకోవచ్చు.  భవిష్యత్తులో కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చు అన్నది చైనా ఆలోచన.  చైనా ఎప్పుడైతే హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది అనే విషయం తెలిసిందో అప్పటి నుంచే కేంద్రం ఈ విషయంపై ఓ కన్నేసి ఉంచింది.  దీన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా తోకజాడించాలని చూస్తే కట్ చేయడానికి తగిన ఎత్తులను సిద్ధం చేసి పెట్టుకుంది కేంద్రం.  


మరింత సమాచారం తెలుసుకోండి: