అమరావతి రాజధాని విషయంలో బొత్స సత్యన్నారాయణ కేంద్ర బిందువైయ్యాడు.  వరసగా అయన చేస్తున్న వ్యాఖ్యలు అమరావతి ప్రజలు భయపెడుతున్నాయి.  ఒక్క అమరావతి ప్రజలనే కాదు.. అటు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్న అనేక మందిని ఇబ్బందులు పెడుతున్నాయి.  ఇప్పటికే అక్కడ పెట్టుబడులు పెట్టిన జపాన్ అమరావతిపై వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నది.  వరల్డ్ బ్యాంక్ కూడా ఇదే విషయంపై పునరాలోచిస్తోంది.  


అమరావతి నిర్మాణం ఆర్ధికంగా భారం అనుకుంటే.. రాజధాని నిర్మాణం చేపట్టాలి అంటే చాలా ఖర్చు అవుతుంది.  అందులో సందేహం అవసరం లేదు.  రాజధాని లేకుండా పాలనా జరుగుతుందా అంటే జరగదు.  ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను కాదని వచ్చేశారు.  ఇలా రావడం వలన ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నాము. తెలుగుదేశం పార్టీ హయాంలో కొన్ని తాత్కాలిక నిర్మాణాలు పూర్తయ్యాయి.  అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ వంటి నిర్మాణాలు పూర్తయ్యాయి.  అక్కడి నుంచే పాలన జరుగుతున్నది.  


ఎప్పుడైతే కృష్ణకు వరద వచ్చిందో అప్పుడు బొత్స చేసిన వ్యాఖ్యలు అందరిని గందరగోళంలోకి నెట్టాయి.  8 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే అమరావతి ముంపుకు గురైంది.  అదే 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.  ప్రశ్నించడం బాగానే ఉన్నది.  కాకపోతే దానికి సొల్యూషన్ ఏంటి అన్నది చెప్తే బాగుంటుంది కదా.  అలా కాకుండా ఇలా ప్రశ్నించి వదిలేస్తే.. ఎలా అని అంటున్నారు ప్రజలు.  

.

ఈరోజు కూడా బొత్స కొన్ని ఆరోపణలు చేశారు.  రాజధాని భూముల విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, తన దగ్గర అన్ని సాక్షాలు ఉన్నాయని, తగిన సమయంలో వాటిని బయటపెడతానని అంటున్నాడు బొత్స.  బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలంగా మారాయి.  మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత ఎంపీ కి కూడా దీనిలో భాగస్వామ్యం ఉందని చెప్పడం వెనుక అర్ధం ఏంటో తెలియడంలేదు.  బొత్స ఎవరిపై ఇలాంటి ఆరోపణలు చేశారో తెలియాల్సి ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: