జమ్మూ కాశ్మీర్ విషయంలో అక్కడి ప్రభుత్వానికి అందరు సహకారించాలని ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కోరింది.  సత్యపాల్ సింగ్ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి.. గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు వింటున్నాడు.  వారి నుంచి ఫిర్యాదులు తీసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఇప్పుడిప్పుడే కాశ్మీర్ లో శాంతియుత వాతావరణ నెలకొంటోంది.  జమ్మూలో ఇప్పటికే శాంతి నెలకొంది.  అక్కడి దుకాణాలు తెరుచుకున్నాయి.  


అయితే కాశ్మీర్ లో అక్కడడక్కడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి.  వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.  దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్య కావడంతో పరిస్థితులు తిరిగి మామూలు స్థితికి రావడానికి కొంత సమయం  పడుతుంది.  దానికోసం ప్రభుత్వం, బలగాలు సహాయం చేస్తున్నాయి.  ఇదిలా ఉంటె, ఇటీవలే రాహుల్ గాంధీ కాశ్మీర్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు.  అంతకు ముందు గవర్నర్ సత్యపాల్ అనుమతి ఇవ్వడంతో కాశ్మీర్ వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు.

కానీ ప్రతిపక్షాలను వెంటబెట్టుకొని వచ్చి.. జైలులో ఉన్న నేతలను కలుస్తాను అనే సరికి అనుమతి రద్దు చేశారు.  ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్న సమయంలో ఇలా వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే.. మళ్ళీ మొదటికి వస్తుందని చెప్పి గవర్నర్ సత్యపాల్ ఇచ్చిన అనుమతిని రద్దు చేశారు.  ప్రతిపక్షాలు కలిసి కాశ్మీర్ వచ్చిన రాహుల్ నుఅడ్డుకున్నారు.  ఆయన్ను తిరిగి అదే విమానంలో ఢిల్లీ పంపించారు.  


రాహుల్ గాంధీ కాశ్మీర్ విషయంలో ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  దీనిపై మాయావతి స్పందించింది.  కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతున్నాయని, ఈ సమయంలో అక్కడి వెళ్లి రగడ చేయడం మంచిది కాదని, కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడే వరకు ఆగలేవా అంటూ రాహుల్ గాంధీకి చురుకు అంటించింది.  కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం అని, పరిస్థితులు సద్దుమణిగాక ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లొచ్చని.. ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న సమయంలో వెళ్లడం మంచిది కాదని ఆమె అన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: