ఈ ఏడాది మొదట్లో 12 మందితో కూడిన మంత్రి మండలిని ప్రకటించిన కేసీఆర్ ఫిబ్రవరి తర్వాత దాన్ని విస్తరణకు సంబంధించిన ఊసే ఎత్తలేదు. తర్వాత తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు వెళ్లడం, వెంటనే మునిసిపల్ ఎన్నికలు రావడంతో అది కాస్త లేట్ అయిపోయింది. ఇంకా ఆరుగురు మంత్రులను క్యాబినెట్లో కెసిఆర్ పూరించాల్సి ఉంది. వారిలో కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇప్పటికే తన స్థానం ఖరారు చేసుకున్నాడు. సిద్దిపేట ఎమ్మెల్యే మరియు పార్టీలో ప్రధాన నాయకుడైన హరీష్ రావు కి ఈసారి కూడా మొండిచేయి కనపడే లాగా ఉంది.

ఇకపోతే క్రితంసారి క్యాబినెట్ లో ఒక్క మహిళా నాయకురాలుకి కూడా మంత్రి పోస్ట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్ పైన విమర్శలు వెల్లువెత్తాయి. కాబట్టి కెసిఆర్ తన అసెంబ్లీలో ప్రకటించినట్లు ఈసారి కనీసం ఒక ఇద్దరు మహిళలకైనా మంత్రి పదవులు కట్టబెట్టి అవకాశం పుష్కలంగా ఉంది. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు వరంగల్ కు చెందిన సత్యవతి రాథోడ్ మరియు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలో రెండు మినిస్ట్రీలు పొందేందుకు వీరిద్దరే ముందంజలో ఉన్నట్లు సమాచారం.

అయితే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి కూడా మినిస్ట్రీ పై కన్నేశారట. అయితే కేసీఆర్ మాత్రం సత్యవతి మరియు సబితా ఇంద్రారెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ముగ్గురు మహిళ ఎమ్మెల్యేలకు మంత్రి పదవిని కట్టబెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇకపోతే ఆరోగ్య మంత్రి అయిన ఈటెల రాజేందర్ పనితీరు పట్ల కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో రహస్యంగా ఉంచాల్సిన విషయాన్ని కొత్త ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టగానే ఈయన లీక్ చేసినట్లు అనేకానేక ఆరోపణలు వచ్చాయి. వాటిలో చాలా వరకు నిజమే అని కేసీఆర్ కూడా అనుకుంటున్నారు. పైగా ఆయన 'ఆరోగ్య శ్రీ' వంటి ప్రధానమైన అంశాలను సరిగ్గా హ్యాండిల్  చేయలేకపోయారని అభియోగాలు చాలానే ఉన్నాయి. కాబట్టి అతని ప్లేస్ లోకి వేరే బీసి ఎమ్మెల్యేని తీసుకు వచ్చే దిశగా కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారట.

మరో పక్క గుట్ట సుఖేందర్ రెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారట. కెసిఆర్ పాత మిత్రుడైన గుట్ట గారు కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ కు తన మకాం మార్చినప్పుడు కేసీఆర్ అతనికి మంత్రి పదవిని కేటాయిస్తానని మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. కాబట్టి ఈసారి విస్తరణలో కేటీఆర్ మరియు గుట్ట ఖచ్చితమైన పోస్టులు అనే చెప్పాలి. ఇక మిగిలిన మంత్రులను ఇప్పుడే చెప్తారా లేదా మరొక విస్తరణకు వాయిదా వేస్తారు అనే విషయం ఇంకా సందేహాస్పదం గానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: