2014లో కేంద్రంలో మోడీ మొదటిసారి ప్రధాని అయ్యారు. కేంద్రంలో మోడీ వచ్చిన తరువాత తెలంగాణాలో ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ సయోధ్యతోనే ఉన్నారు.  ఇద్దరి మధ్య మంచి అనుబంధం నడిచింది.  ఇద్దరికి ఎలాంటి వైరం లేదు.  దీంతో తెలంగాణాకు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని సక్రమంగా రాష్ట్రానికి వచ్చాయి.  ముఖ్యంగా రైతులకు రావాల్సిన యూరియా వంటివి సకాలంలో అందాయి.

దీంతో రైతులు అప్పట్లో ఇబ్బందులు పడలేదు.  పైగా రైతులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా యూరియాను అందించాలని కెసిఆర్ అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు.  ఎందుకంటే అప్పట్లో కెసిఆర్ కు.. కేంద్రానికి మంచి లింకు ఉండేది.  కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  కేంద్రం రాష్ట్రాలతో జరిపే సమావేశాలకు కెసిఆర్ హాజరు కావడం లేదు.  పైగా మోడీని కెసిఆర్ బహిరంగంగా విమర్శిస్తున్నారు.

కారణం ఏంటి.. ఎందుకు వచ్చింది ఈ గ్యాప్ అంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత అంతా మారిపోయింది.  సమీకరణాలు మారిపోయాయి.  గతంలో నిజామాబాద్ లో కవిత భారీ మెజారిటీతో విజయం సాధిస్తే ఈసారి కవిత ఓటమిపాలైంది.  ఇది కెసిఆర్ కు పెద్ద దెబ్బగా మారింది.  పైగా అక్కడ బీజేపీ విజయం సాధించింది.  అంతేకాదు.. వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీ తెలంగాణాలో పాగా వేయాలని చూస్తోంది.  


ఆ విధంగానే పావులు కదపడం మొదలుపెట్టింది. దీంతో కెసిఆర్ కేంద్రానికి దూరం అవుతూ వస్తున్నారు.  మోడీని కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.  ఇటీవల జరిగిన నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కెసిఆర్ వెళ్లకపోవడంతో ఈ గ్యాప్ మరింతగా పెరిగింది. 

గతంలో అడిగినంత యూరియాను పంపించిన కేంద్రం.. ఇప్పుడు ఆ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవడం లేదు.. దీంతో రైతులు రోడ్డెక్కుతున్నారు.  యురియూ సమయానికి వస్తుందని చెప్పి రైతులు ఎక్కువ మొత్తంలో పంటలు వేయడానికి సిద్ధం అయ్యారు.  ఈ సమయంలో యూరియా లేదని తెలియడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు.  ఇదే కంటిన్యూ అయితే.. ఫ్యూచర్ లో ఇబ్బందులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: