మంత్రుల విషయంలో జగన్ ప్రభుత్వం చాలా ఖచ్చితంగా వ్యవహారిస్తోంది.  ఎవరు ఎలాంటి తప్పులు చేసినా క్షమించడం లేదు.  అవినీతికి పాల్పడే వ్యక్తులను అసలు ఉపేక్షించడం లేదు.  వాళ్ళు ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ససేమిరా అంటోంది.  మంత్రుల నియామకం సమయంలోనే జగన్ కొన్ని విషయాలను చాలా క్లియర్ గా చెప్పాడు.  


పరిపాలన విషయంలో అశ్రద్ధ చేయకూడదు.  ఎక్కడైనా అలా చేసినట్టు కనిపిస్తే ఆ మంత్రుల స్థానంలో కొత్త మంత్రులను తీసుకుంటానని చెప్పారు.  గత కొంతకాలంగా ఓ ఇద్దరు మంత్రుల గురించి జగన్ కు పదేపదే ఫిర్యాదులు అందుతున్నట్టు తెలుస్తోంది.  ఆ ఇద్దరిలో ఒకరు జూనియర్ మరొకరు సీనియర్ అని తెలుస్తోంది.  వీరిద్దరూ వారి పదవులకు న్యాయం చేయలేకపోతున్నారని కంప్లైంట్స్ రావస్తున్నాయని సమాచారం.  


జగన్ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు.  వారి పదవుల్లో మార్పులు చేయాలనీ చూస్తున్నారట.  దానికోసం ఇప్పటి నుంచే జగన్ ఆలోచనలో పడ్డారని, త్వరలోనే వారి శాఖలు మార్చిడం గాని, లేదంటే వారి స్థానంలో కొత్త వాళ్ళను తీసుకురావడంగాని చేస్తారని అంటున్నారు.  ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉన్నది. ఒకవేళ జగన్ మార్పులు చేస్తే.. ఆ అవకాశం ఎవరికి వస్తుంది.. 


మంత్రి పదవి వస్తుందని గతంలో మీడియాలో భారీ ప్రచారం జరిగిన రోజాకు అవకాశం ఇస్తారా లేదంటే మరెవరికైనా ఆ అవకాశం ఇస్తారా.. చూడాలి.  లేదంటే మంత్రి పదవుల్లో మార్పులు చేసి.. కష్టమైన పదవులను యాక్టివ్ గా ఉండే వ్యక్తులకు ఇస్తారా అన్నది చూడాలి.  అయితే, వారి మంత్రి పదవులకు న్యాయం చేయలేకపోతున్న ఆ ఇద్దరు ఎవరు అన్నది తెలియాల్సి ఉన్నది.  ఆ ఇద్దరు ఎవరు ఏంటి అనే విషయాలు తెలియాలంటే కొంత సమయం పట్టొచ్చు.  అప్పటి వరకు రాజకీయాల్లో జరుగుతున్న మార్పులను చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేము. 


మరింత సమాచారం తెలుసుకోండి: