ప్రపంచం చిక్కుల్లో పడిందా అంటే ఔననే అనిపిస్తున్నాయి పరిస్థితులు.  ప్రపంచాన్ని ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చిన అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు భయానకంగా మారింది.  ఈ కార్చిచ్చు కారణంగా లక్షలాది చెట్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఆక్సిజన్ విడుదల చేసే చెట్లు.. ఈ అగ్నికి ఆహుతి అవడం మూలంగా.. కర్బన పదార్దాలు విడుదలౌతున్నాయి.  దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  


భూతాపం విపరీతంగా పెరిగిపోతున్నది.  దీని కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.  భూతాపం పెరిగిపోవడంతో భూమిలో ఉండే నీరు ఆవిరైపోతుంది.  ఫలితం నీటి ఎద్దడి.  ఒకదానికొకటి వరసగా లింకులు ఉన్నాయి.  ఇది అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.  అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు కారణంగా అనేక వన్యప్రాణాలు మృతి చెందుతున్నాయి.  గిరిజన ప్రజలు మృత్యువాత పడుతున్నారు.  


ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఆఫ్రికాలోని కాంగో బేస్ లో ఉన్న అడవులకు కూడా కార్చిచ్చు అంటుకుంది.  ఈ అడవులు 33 లక్షల చదరపు కిలోమీటర్ల మేర వివిధ దేశాల్లో విస్తరించి ఉన్నాయి. అత్యధిక భాగం డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో, మిగతా భాగం గాబొన్‌, కాంగో, కామెరూన్‌, మధ్య ఆఫ్రికాలో వ్యాపించి ఉన్నాయి. అమెజాన్‌ అడవుల మాదిరిగానే కాంగో అడవులు కూడా టన్నుల కొద్దీ కార్బన్‌ డై ఆక్సైడ్‌ ను పీల్చుకుని పర్యావరణానికి దోహదపడుతున్నా యి. అంతరించిపోతున్న జీవజాతులు ఈ అడవుల్లోనూ ఉన్నాయి. నాసా చిత్రాల్లో కనిపించిన మంటలు అత్యధిక భాగం వర్షార ణ్యం వెలుపల వ్యాపించినవి’ అని నిపుణులు చెబుతున్నారు. 


అయితే, ఆఫ్రికాలోని అడవులు అమెజాన్ అడవులతో పోల్చలేము.  ఆఫ్రికా భూభాగం ఎక్కువగా డ్రై గా ఉంటుంది.  డ్రై గా ఉండే ఈ భూభాగంలోని అడవుల్లో వ్యవసాయం చేసే సమయంలో ఇలాంటి మంటలు సహజమే.  ఈ అడవుల్లో కార్చిచ్చు సహజమే.  అవి పెద్దగా తీవ్రతను చూపించవు.  అయితే, నాసా చిత్రాల ప్రకారం ఆఫ్రికా అడవుల్లోని కార్చిచ్చు రగులుకుందని ఫలితంగా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు.  ఒకవేళ ఆఫ్రికాలో కూడా అమెజాన్ లాంటి కార్చిచ్చే అంటుకొని ఉంటె.. ఫలితంగా ప్రపంచం తన రెండు ఊపిరి తిత్తులను కోల్పోయినట్టు అవుతుంది.  అంటే మనిషి లైఫ్ వెంటిలేటర్ పై ఉన్నట్టే.  అలా కాకుడదు అంటే కృత్రిమంగా అయ్యినా సరే ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: