రాష్ట్రంలో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో దూసుకు పోతున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ కు ప్ర‌ధాన అడ్డంకిగా మారుతుంద‌ని అనుకు న్న కేంద్ర ప్ర‌భుత్వ జోక్యం దాదాపు లేన‌ట్టేన‌ని తెలుస్తోంది. రాష్ట్రంలో ఆయ‌న ఒక్క పోల‌వ‌రం, విద్యుత్ పీపీఏలు మిన‌హా ఏ విష‌యంపైనై నా నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు, స్వేచ్ఛ ఉన్నాయ‌నే విషయం స్ప‌ష్ట‌మైంది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఏం చేసినా.. కేంద్రం క‌న్నె ర్ర చేస్తుంద‌ని అంద‌రూ భావించారు.


ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా ఆ పార్టీ నాయ‌కులు, బీజేపీ రాష్ట్ర నాయ‌కులు.. ఇక్క‌డ భూములు ఇచ్చిన వారు కొన్న వారు అంద‌రూ ఇలా ఇటీవ‌ల కాలంలో విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. రాజ‌ధానిని మార్చే హ‌క్కు లేద‌ని జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. అదేస‌మ‌యంలో రాజ‌ధానిని ఎలా మారుస్తార‌ని కూడా ప్ర‌శ్నిస్తు న్నా రు. ఇక‌, ఇక్క‌డి రైతుల‌ను టీడీపీ ఒక ర‌కంగా రెచ్చ‌గొడుతోంద‌నే చెప్పాలి. 


ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించి 2000 కోట్లు ఇచ్చామ‌ని చెబుతున్న కేంద్రం ఏమైనా జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను తిప్పికొడుతుందా?  పోల‌వ‌రం ప్రాజెక్టు రివ ర్స్ టెండ‌ర్ల పై ఆగ్ర‌హించిన స్థాయిలో చ‌ర్య‌లు ఏమైనా ఉంటాయా? అని ప్ర‌తి ఒక్క‌రూ అనుకున్నారు. అయితే, తాజాగా ఇలాంటి దేమీ లేద‌ని స్ప‌ష్ట‌మైంది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని మార్చాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 


రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం..కేంద్రం జోక్యం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మేం ఆపలేం. అమరావతిని కేంద్రం సూచించలేదు. అని తాజాగా బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు స్ప‌ష్టం చేశారు. దీనిని బ‌ట్టి.. రాజ‌ధాని నిర్మాణాన్ని కొన‌సాగించాల‌న్నా.. వ‌దులుకోవాల‌న్నా కూడా జ‌గ‌న్ చేతిలోనే అంతా ఉంద‌నేది వాస్త‌వం. అయితే, కేంద్రం నుంచి లెక్క‌ల ప్ర‌కారం మ‌రో 3000 కోట్లు రాజ‌ధాని నిర్మాణానికి రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ వివాదాల‌కు తావులేకుండా చూసుకుని ముందుకు వెళ్తే.. ప్ర‌జాభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తే.. స‌రిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


ఇక‌, తాజాగా జీవీఎల్ ప్ర‌క‌ట‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయేది టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన మేధావుల‌కు, త‌న అనుకున్న వారికి ఇక్క‌డ ఇబ్బ‌డి ముబ్బ‌డిగా భూములు క‌ట్ట‌బెట్టారు. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ ఈ భూముల‌ను వెన‌క్కి తీసుకున్నా.. రాజ‌ధానిని కుదించినా.. లేక రాజ‌ధానిలో ఓ భాగాన్ని ఇక్క‌డ నుంచి మార్చినా కూడా తీవ్రంగా న‌ష్ట‌పోయేది చంద్ర‌బాబే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ఎలా చెల‌రేగుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: