ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల ఏపీ సర్కారు తీరుపై ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. మూడు నెలలు తిరగకుండానే ఏపీ జగన్ కారణంగా సర్వనాశనం అయిపోయిందట.. ఆర్థిక మాంద్యం వచ్చేసిందట.. అభివృద్ధి అంతా ఆగిపోయిందట.. జగన్ పాలన ప్రభావంతో ఇప్పటికే ఏపీకి అన్ని సూచికల్లోనూ వెనుకబడిపోయిందట.. ఇలా రెచ్చిపోయారు ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు .


యనమల ఏమన్నారంటే.. ఏపి సర్వనాశనం ముఖ్యమంత్రి జగన్ విధ్వంసక స్వప్నం.. ఏపికి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ పెంచారు... చంద్రబాబు తెచ్చిన ఇమేజికి డేమేజి చేయడమే జగన్ డ్రీమ్. రాకూడని ఆర్ధిక అవలక్షణాలన్నీ రాష్ట్రానికి వచ్చేశాయంటున్నారు. వైసిపి నేరాల చరిత్ర చూసి పెట్టుబడులు రావని.. బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని యనమల విమర్శించారు. ఎన్నికల్లో టిఆర్ ఎస్ నుంచి మేళ్లు పొందినందుకే... జగన్ వారికి ప్రత్యుపకారంగా ఏపీలో వైసిపి మాంద్యం సృష్టిస్తోందట. అమరావతిలో ఎకానమి దెబ్బతీసి, హైదరాబాద్ లో ఎకానమి పెంచడమే సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారట. టిఆర్ ఎస్ రుణం తీర్చుకోడానికి ఏపి అభివృద్ధికి గండికొట్టడం హేయం అంటున్నారు యనమల.


యనమల రామకృష్ణుడి విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెచ్చిపోయి స్పందించాహరు. పసలేని విమర్శలు చేసి పరువు తీసుకోవద్దని విజయసాయిరెడ్డి హితవు పలికారు. సీఎం వైయస్‌ జగన్‌పై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇలాంటి చౌకబారు విమర్శలు చేసే ప్రతిపక్షానికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.


ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. "ఏమైంది యనమల గారూ? తెలంగాణ లబ్ది కోసం జగన్‌ గారు రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారా? ఆర్ధిక మంత్రిగా రాష్ట్రాన్ని20 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనులు మీరు. ఎన్నికల ముందు కూడా ఇలాగే కేసీఆర్, మోదీలతో చేతులు కలిపామని ఆరోపణలు చేస్తే ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా?''అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: