శ్రీకాకుళం జిల్లాలో అధికార వైసీపీలో తిరుగులేని నేతలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ధర్మాన సోదరులే. ఇద్దరు రాజకీయంగా సీనియర్ నేతలే అయినా ధర్మాన ప్రసాదరావు మాత్రం అన్న ధర్మాన కృష్ణదాస్ కంటే కొంచెం ఎక్కువ సీనియర్ అని చెప్పొచ్చు. ప్రసాదరావు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత. నేదురుమల్లి, కోట్ల, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఇక 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఓటమి పాలైన  తాజా మాత్రం ఎన్నికల్లో గెలిచారు.  


అటు అన్న ధర్మాన కృష్ణదాస్ 2004, 2009 ఎన్నికల్లో తమ్ముడుతో పాటు కాంగ్రెస్ లో గెలిచారు. కానీ వైఎస్ మరణం జగన్ వైసీపీ పెట్టడంతో రాజీనామా చేసి అందులోకి వెళ్ళిపోయారు. అప్పుడు 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. అయితే 2014 లో ఓడిన కృష్ణదాస్ 2019లో గెలిచి మంత్రి అయ్యారు. ఇక ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది అన్నదమ్ములు ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే జగన్ మొదటి నుంచి కృష్ణదాస్ పార్టీకి అంటిపెట్టుకునే ఉండటంతో సీనియర్ గా ఉన్న ప్రసాదరావుని పక్కనబెట్టి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు.


ఇదే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడానికి కారణమైంది. ఇక ఈవిషయంపై మొదట్లో బాగానే ఉన్న తరువాత కాలంలో ఈ ఇద్దరి మధ్య పలు విషయాలపై మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రి కృష్ణదాస్‌ పరోక్షంగా స్పందిస్తూ రెండేళ్ల తరువాత తనకు మంత్రి పదవి వద్దని, ఇక క్రియాశీలక రాజకీయాల్లో ఉండనని చెప్పుకొచ్చారు. ఇదంతా 'తమ్ముడి'ని బుజ్జగించేందుకే మాట్లాడినట్లు తెలిసింది. కానీ సీనియర్‌ అయిన తనను పక్కన పెట్టారనే భావనతో ప్రసాదరావు ఇటీవల కాలంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రతిపక్ష టీడీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా ధర్మాన ప్రసాదరావు పాల్గొనడం చర్చనీయాంశమైంది.


అన్నని ఇరుకున పెట్టడానికి ప్రసాదరావు ఇదంతా చేస్తున్నారని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా అన్నదమ్ముల మధ్యే అయితే విభేదాలు ఉన్నట్లు కనిపిస్తోన్నాయి. మరి టీ కప్ లో తుఫాన్ లా ఉన్న వీరి విభేదాలకు ఎప్పుడు చెక్ పడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: