ఆంధ్ర  ప్రదేశ్  రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడికి గడ్డు కాలం ఆసన్నమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ కేవలం 23 అసెంబ్లీ స్థానాలను సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో పార్టీ కూడా క్రమేణా బహీనపడుతుంది. కారణాలు ఏమైనా కావచ్చు కానీ.. ఇప్పటికే సొంత మనుషులు అనుకున్నవాళ్ళు కమలం దళంలోకి చేరిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో చ ద్రబాబుకు ఉత్తరంధ్రాలో ఊహించని షాక్ తగిలింది. వాస్తవానికి ఎలాంటి షాక్ లు ఆయనకు కూటమి కాదు.




పాడి పరిశ్రమతో సంబంధం ఉన్న రైతులు కూడా త్వరలో వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్నారని ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబుకు ఉత్తరంధ్రాలో ఊహించని షాక్ తగిలింది. ఇక జిల్లాలో టిడిపి స్ట్రాంగ్‌మన్‌గా పరిగణించబడిన అడారీ తులసి రావు కుమారుడు ఆనంద్ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో   ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. టీడీపీ సంస్థాగతంగా తీవ్రంగా నష్టపోనున్నదనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు తెలుగు దేశం పార్టీ కనుసన్నల్లో కొనసాగిన విశాఖ డైరీ భష్యత్తులో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి మారనుందన్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 





జగన్ సమక్షంలో సెప్టెంబర్ 1న వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారు. అందుకు కారణం విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్, తన 12 మంది డైరెక్టర్లతో కూడిన బృందం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు షాక్ ఇచ్చారు . విజయవాడలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆనంద్ వైఎస్సార్‌సీపీలో చేరటానికి అడారి ఆనంద్ సిద్ధం అవుతున్నారు . చేరికతో సుమారు మూడు దశాబ్ధాలుగా టీడీపీ చేతిలో ఉన్న విశాఖ డైరీ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనుంది . దీంతో ఇంతకాలం టీడీపీ సానుభూతిపరుల చెప్పుచేతుల్లో ఉన్న ఉత్తరాంధ్రలోని పాల సొసైటీలు సైతం వై సీపీ అండర్ లోకి వెళ్లనున్నాయి. వైఎస్‌ఆర్‌సిపి చీఫ్,ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయనతో పాటు విశాఖ డైరీ డైరెక్టర్స్ అందరూ వైసీపీలో చేరనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: