వైసీపీ అంతా అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విబిసి ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ ఎంవిఎస్‌ మూర్తిగారి మనవడు భరత్‌కు జగ్గయ్యపేట వద్ద 490 ఎకరాలు ఉచితంగా ఇచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమన్నారు.  

2007లో ఈ కంపెనీకి ప్రపోజల్‌ రావడం జరిగిందన్నారు. 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎంఓయూలు, 2013లో 490 ఎకరాలు సీసీఎల్‌ నుంచి ఏపీఐఐసి ద్వారా రూ. లక్ష రూపాయలతో ట్రాన్స్‌ఫర్‌ చేయడం జరిగిందన్నారు. యూరియా కంపెనీ పెట్టుకోవడానికి కేంద్రప్రభుత్వం పర్మిషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అదే పొలాన్ని 13 లక్షల 50 వేల రూపాయలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. రూ. 67 వేల కోట్ల డబ్బులు చెల్లించాల్సిందిగా 2016 మే నెలలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 


2016లో రక్షణ స్టీల్స్‌ లిమిటెడ్‌ హైకోర్టుకు అప్రోచ్‌ అయి  స్టే తీసుకురావడం జరిగిందన్నారు.  బొత్స సత్యనారాయణ ఒక బాధ్యత కలిగిన సీనియర్‌ మంత్రి. జగన్‌ పరిపాలనలో మున్సిపల్‌ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 490 ఎకరాల భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉందా? లేక భరత్‌ కంపెనీ ఆధీనంలో ఉందా? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.  ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 490 ఎకరాలను ఎంతకు అమ్ముతారో అమ్మమని సవాల్‌ విసిరారు. 


490 ఎకరాలు భరత్‌ కంపెనీ  దాదాపు 250 స్క్వేర్  కిలోమీటర్లు కృష్ణా జిల్లాలోని 14 నియోజకవర్గాలు సీఆర్‌డిఏలో కలిపేసినంత మాత్రాన కొంపలు మునగలేదు, రేట్లేమీ పెరగలేదన్నారు. ఈ రోజు ప్రభుత్వం ఆధీనంలో ఉందా? కనీస సమాచారం లేకుండా అభూత కల్పన చేసి పెద్ద చరిత్ర సృష్టించినట్లుగా మాట్లాడారు. ఎకరా రూ.13 లక్షలకు 493 ఎకరాలు చంద్రబాబునాయుడుగారు భరత్‌కు అమ్మారని మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? చూపించగలరా? 5 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అబద్ధాలు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: