ఈటెల రాజేందర్...తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన నాయకుడు. అయితే పార్టీ ఎలాంటి పరిస్తితుల్లో ఉన్న అండగా నిలబడిన ఈటెల..ఇప్పుడు రెబల్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఎప్పుడు సైలెంట్ గా ఉండి తన పని తాను చేసుకునే ఈ నాయకుడు ఇప్పుడు మాటల తూటాలు పేలుస్తున్నాడు.   2014లో పార్టీ అధికారంలో రాగానే మంత్రిగా చేసిన ఈటెల...2018 ఎన్నికల్లో కూడా గెలిచి కేసీఆర్ కేబినెట్ లో మంత్రి అయ్యారు.


కాకపోతే ఈ తడవ కాస్తా అటు ఇటు అయ్యి మంత్రి పదవి వస్తుందా రాదా అని ప్రచారం జరిగాక కేసీఆర్ పదవి ఇచ్చారు. అయితే ఇక్కడవరకు అంతా బాగానే ఉంది. కానీ తాజాగా కేసీఆర్ మరోసారి మంత్రివర్గ విస్తరణ చేస్తారని, కొత్తవాళ్ళకి అవకాశమివ్వడానికి ఈటెలని మంత్రివర్గం నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది. ఇక్కడే ఈటెలలో అసలు ఫైర్ లేచింది. నన్ను మంత్రివర్గం నుంచి ఎందుకు తప్పిస్తారని రైజ్ అయ్యారు. ‘మంత్రి పదవి నాకు ఎవరో వేసిన బిక్ష కాదు.  గులాబీ పార్టీ ఓనర్లం మేము. పార్టీలోకి మధ్యలో వచ్చినోళ్ళం కాదు. అడుక్కుని వచ్చినోళ్ళం కాదు’ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.


అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా కేసీఆర్ పెత్తనం మీద ఈటెల మాట్లాడినా వ్యాఖ్యలని ప్రచారం జరిగింది. దీంతో వెంటనే విషయం గ్రహించిన ఈటెల దిద్దుబాటు చర్యలు చేశారు. కేసీఆరే మా నాయకుడు అంటూ మరో ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసే లోపే జరగాల్సిన డ్యామేజ్ కాస్తా జరిగిపోయింది. అప్పటికే ఈటెలపై రెబల్ ముద్ర పడిపోయింది. అధిష్టానానికి చేరాల్సిన రీతిలో ఈటెల మాటలు చేరిపోయాయి. దీంతో అధినేత కేసీఆర్ ఈటెల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపైనే ఉత్కంఠత కొనసాగుతుంది. ఈటెలని మంత్రివర్గం నుంచి తప్పిస్తారా? లేక ఉంచుతారా అనేది తెలియడం లేదు.


ఒకవేళ తెలంగాణ బీసీల్లో బలమైన నాయకుడుగా ఉన్న ఈటెలని తప్పిస్తే ..బీసీల్లో వ్యతిరేకిత వస్తోంది. బీసీలని కావాలనే అణిచి వేస్తున్నారని విమర్శలు వస్తాయి. అలా కాకుండా ఈటెలని కొనసాగిస్తే కేసీఆర్ బలహీనం అయినట్లుంటుంది. పోనీ ఈటెల ప్లేస్ లో మరో బీసీ నాయకుడుని తీసుకుంటే అది పార్టీపై ఖచ్చితంగా ప్రభావం చూపుతోంది. ఎందుకంటే ఈటెల కంటూ బీసీల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈటెల విషయంలో కేసీఆర్ సందిగ్ధంలో పడిపోయినట్లు కనబడుతోంది. మరి చూడాలి కేసీఆర్ రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. 


మరింత సమాచారం తెలుసుకోండి: