కొందరికి పెళ్ళామంటే బెల్లం అవుతుంది.మరికొందరికి అదే పెళ్ళాం మోజుతీరాక వదిలేసే అంగడి వస్తువవుతుంది.ఇక పడక గదిలో ఎవరి పర్మిషన్ లేకుండానే పనికానిస్తాడు మగాడు.అదే భార్య విషయంలో ఏదైనా కావాలంటే అమ్మనడుగు,అంటారు దాదాపుగాఇలాగే వున్నారు.,ఇక కట్నంకోసం తల్లిదండ్రులు వేధిస్తుంటే వారి పర్మిషన్ లేనిదే భార్యకు సపోర్ట్ ఇవ్వడు.ఇలాంటి కాలంలో ఇండియాలో వున్న వారికే సెక్యూరిటీ లేదు..ఇకఎన్నారై సంబంధం వచ్చిందంటే ఎగిరి గంతేస్తారు పిల్ల తరపువారు. అలా సంబరపడిన ఇంట్లో ఆ ఆనందం మూన్నాళ్ల ముచ్చటే అయింది.పెళ్లయిన నాటి నుంచి అత్తమామలు ఆమెను వేధిస్తూ, కట్నం తీసుకురావాలంటూ హింసించేవారు.ఈ విషయం చెప్పుకొని బాధపడుతున్న కుమార్తెను ఓదార్చడం ఆ తల్లిదండ్రులకు తలకు మించిన భారమైంది.



చివరకు న్యూజిలాండ్‌లో ఉన్న భర్త కూడావచ్చి,తన తల్లిదండ్రులు చేసింది సరైనపనే అనడంతో ఆమె షాక్ తిన్నది..అయితే ఈ పరిస్థితిని నేను చక్కదిద్దుతానన్న భర్త. ఆమెను తనతో న్యూజిలాండ్ వచ్చేయమన్నాడు.భర్తపై నమ్మకంతో విదేశాలకు వెళ్లిన ఆమె..తన కష్టాలు తీరినట్లేనని భావించింది.అయితే ఆమె ఆశలన్నీ అడియాసలే అయ్యాయి.న్యూజిలాండ్ వెళ్లిన ఆమెను భర్తే లైంగికంగా వేధించడం మొదలెట్టాడు.పరాయి మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని,వారిని ఇంటికే తీసుకురావడం ప్రారంభించాడు.తన కళ్లముందే భర్తచేస్తున్న అకృత్యాలనుచూసిన ఆమె నిర్ఘాంతపోయింది.ఇదేంటని ప్రశ్నిస్తే చంపేస్తానం టూ బెదిరించాడు.దీంతో ఆమె పుట్టింటికి పారిపోయి వచ్చింది.



అప్పుడు ఫోన్ చేసిన భర్త..తన తప్పు తెలుసుకున్నానని,ఇకపై అలా ప్రవర్తించనని నంగనాచిలా నాటకమాడుతూ ఆమెకు,ఆమె కుటుంబానికి మాటిచ్చాడు.ఆ మాట నమ్మిన పిచ్చిది,న్యూజిలాండ్‌లోని భర్త వద్దకు వెళ్లింది.అక్కడ ఇదివరకు భరించిన దాని కంటే వేధింపులు ఇంకా ఎక్కువైయ్యాయి.ఆమెను మరింత హింసించసాగాడు.చివరకు ఒకరోజు కత్తితో ఆమెను పొడిచేశాడు కూడా.దీంతో భయపడిపోయిన ఆ మహిళ..మరోసారి భర్తకు తెలియకుండా స్వదేశానికి తిరిగొచ్చి,స్థానికంగా ఉన్న మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ ప్రాంతంలో జరిగింది.బాధితురాలికి తప్పకుండా న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చి,ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మహిళా పోలీసు విభాగం అధికారిణి నందినీ సింహ్....చూసారుగా ఈ కేసును..అందం,ఆస్తి వుంటే సరిపోదు గుణం వుండాలి అలాంటి వాడు భార్యను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: