ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడబోతుందా..!. ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలను బట్టు చూస్తే.. అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన  తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై  ఎదురు దాడికి సర్వసన్నర్ధమైంది. ఈ క్రమంలో  జగన్ ప్రభుత్వం చేపట్టిన అక్రమకట్టడాల కూల్చివేత మొదలు చివరికి వరద బురదను సైతం జగన్ కు పులిమేందుకు కంకణం కట్టుకుని కూర్చున్నారు. అమరావతి అంశంతో ప్రజల్లో సానుభూతిని పొందేందుకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కమలనాధులు సైతం జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై స్వరం పెంచారు. ఇటీవలే కమలం దళంలో చేరిన చంద్రబాబు అనుమాయులు బాహాటంగానే ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపుతున్నారు.





దీనితో నిన్న మొన్నటి వరకు చాపకింద నీరు చందంగా వ్యవహరించిన బీజేపీ శ్రేణులు ఇప్పుడు బహిరంగంగానే  దాడిలో సిద్ధపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ భాజపా నాయకులు సీక్రెట్ సమావేశాలను నిర్వహించడంపై రాజకీయ విశ్లేషకులు  తర్జన భర్జనపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ తనదైన ఎత్తగడతో ముందుకు వెళ్తోందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్ధానాలను కైవసం చేసుకుని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్‌), గులాబి దళాధినేతకు చిన్న జర్క్ ఇచ్చారనే చెప్పాలి. అందులోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు కుమార్తె కవిత ఓటమి చవిచూడడటాన్నిటీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నాలుగు ఎంపీ స్థానాలతో  తెలంగాణాలో  మేమే ప్రత్యామ్నాయం అంటూ చెప్పకనే చెబుతోంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే.. సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది తేమేనంటున్నారు కమలదళం.






ఇప్పటికే టీడీపీకి చెందిన సీనియర్ నేతలు అనేకమంది ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. ఇప్పడు ఏపీలో కమలం పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా శనివారం హైదరాబాద్ గచ్చిబౌలిలో గల ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నివాసంలో బీజేపీ నేతల రహస్యంగా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో బీజేపీ నేతలు సోమువీర్రాజు, పురందేశ్వరి, మాణిక్యాలరావు, టీజీ వెంకటేశ్, సుజనాచౌదరి, సీఎం రమేశ్ వంటి నేతలు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే ఏపీకి చెందిన నేతలు తెలంగాణలో సమావేశం కావాల్సిన అవసరం ఏమిటీ? అనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ సీక్రెట్ మీటింగ్‌కి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హాజరుకావడం కూడా ఆసక్తిని పెంచుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: