బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది.  ఇంకా తీసుకుంటూనే ఉన్నది.  తలాక్ బిల్లుతో మొదలు పెట్టి వరసగా షాక్ ఇచ్చే నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో ఇప్పటి వరకు పేరుకుపోయిన కంపును ఒక్కొక్కటిగా కడిగేస్తున్నది.  ఇందులో భాగంగానే బీజేపీ ఎన్ఆర్సిని తీసుకొచ్చింది.  ఈ ఎన్ఆర్సి అంటే ఏంటి.. ఎందుకు వచ్చింది చూద్దాం.  


ఎన్ఆర్సి పధకాన్ని ప్రవేశపెట్టడానికి కారణాలు ఉన్నాయి.  దేశంలోకి అనేక దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన చాలామంది దేశంలో ఉన్నారు.  వివిధ రకాల మార్గంలో ఇండియాకు వచ్చారు.  వచ్చిన వాళ్ళు ఎక్కడ  దొరికితే అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.  పనులు చేసుకుంటున్నారు.  విదేశాల్లో మాదిరిగా మన దగ్గర పౌరులను ఎవరు ఏంటి అని అడగరు.  ఎక్కడి నుంచి వచ్చారో పెద్దగా పట్టించుకోరు.  ఎందుకంటే వాళ్ళు అక్రమంగా వచ్చిన వాళ్ళు కాబట్టి.  


వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తుంటారు.  వాళ్ళను గుర్తించి పట్టుకోవడం చాలా కష్టం.  అందుకే కేంద్రం దేశంలో అక్రమంగా నివసిస్తున్న వ్యక్తుల సంఖ్యను గుర్తించి వారికి భారత పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎన్ఆర్సి చట్టాన్ని తీసుకొచ్చింది.  అస్సాం రాష్ట్రంలో మొదట దీన్ని అమలు చేస్తున్నది.  పురసత్వం కోసం దాదాపు అస్సాంలోని 3.19 కోట్ల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించింది.  అందులో 3.11 లక్షల మందిని భారత పౌరులుగా గుర్తించారు.  19 లక్షల మందిని ఎన్ఆర్సి తుది జాబితాలో చోటు దక్కలేదు.  


ఈ 19 లక్షల మంది భారత పౌరుల కిందరారు. వీరిని విదేశీయులుగానే పరిగణిస్తారు.  విదేశీయులుగా పరిగణింపబడిన ఈ  వ్యక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించరు కాబట్టి వీరు తిరిగి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే.  అస్సాంలో ఈ పధకం విజయవంతంగా అమలు కావడంతో ఈ పధకాన్ని ఇండియా అంతటా ప్రవేశపెట్టాలని చూస్తున్నది. అదే జరిగితే.. ఇండియాలో ఎంతమంది అక్రమంగా ఉంటున్నారో అర్ధం అవుతుంది.  


ఎంతమంది నిజమైన భారతీయ పౌరులో ఎంతమంది అక్రమంగా వలస వచ్చి ఇండియాలో ఉంటున్నారో తెలుసుకోవచ్చు.  ఎక్కడి నుంచి వచ్చారో వారిని గుర్తించి తిరిగి వారి స్వస్థలాలకు పంపించవచ్చు.  లేదంటే వారికి పౌరసత్వం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవచ్చు.  ఇండియా అంతటా దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలియగానే బెంగాల్ ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది.  బాంగ్లాదేశ్ నుంచి చాలా మంది వలస వచ్చి బెంగాల్ లో ఉంటున్నారు.  వారికి దీదీ ప్రభుత్వం హడావుడిగా ఓటరుకు కార్డులు ఇప్పించి తనకు అనుకూలంగా మార్చుకున్నది.  ఇప్పుడు కేంద్రం ఎన్ ఆర్సి ని అమలు చేస్తే.. పాపం దీదీకి కష్టాలు తప్పవు.  


మరింత సమాచారం తెలుసుకోండి: