సాధారణంగా ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారు.  వారు పుట్టిన ప్రాంతం, దేశం, వారి స్థితిగతులను బట్టి కూడా ఈ  ఎదుగుదల ఉంటుంది.  సాధారణ కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలకు సరైన పోషకాహారం లేకుంటే.. తొందరగా ఎదగలేరు.  కొద్దిగా ఆలస్యం అవుతుంది.  అదే ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు తక్కువ వయసులోనే ఎదుగుతారు.  


ఆలా ఓ రిచ్ ఫ్యామిలీలో పుట్టి మంచి చదువు చదువుకున్న యువతి క్వీన్ రానియా.  కువైట్లో 1970లో జన్మించింది.  అమెరికాలో చదువుకుంది.  చదువు పూర్తయ్యాక అక్కడే సిటీ బ్యాంక్ లో ఉద్యోగం చేసింది.  అక్కడి నుంచి జోర్డాన్ వచ్చి.. అక్కడ యాపిల్ కంపెనీలో జాయిన్ అయ్యింది.  ఓ సమయంలో జోర్డాన్ యువరాజు ఓ కార్యక్రమంలో ఆమెను కలిశారు.  ఆమెతో పరిచయం ఏర్పడింది.  అప్పటి నుంచి ఇద్దరు ప్రేమించుకున్నారు.  


వీరి ప్రేమ పెళ్లి వైపు అడుగులు వేసింది.  1993లో ఈ ఇద్దరు వివాహం చేసుకున్నారు.  క్వీన్ రానియా పెళ్లి చేసుకునే సమయానికి ఆమె వయసు కేవలం 23 సంవత్సరాలే.  అంటే చదువు పూర్తైన వెంటనే రెండు రకాల ఉద్యోగాలు చేసింది. చాలా చురుకైన అమ్మాయి.  ప్రతి విషయంలో ముందు ఉండి పనులు చక్కబెడుతుంది.  అలా జోర్డాన్ యువరాజు మనసులో పడింది.  చురుగ్గా అడుగులు వేసింది.  


కాగా, 1999లో జోర్డాన్ మహారాజు మరణించిన తరువాత యువరాజు సింహాసనాన్ని అధిష్టించారు.  అప్పటి నుంచి రానియా క్వీన్ రానియాగా మారిపోయింది.  ఈమె ప్రస్తుతం మధ్య ఆసియా నుంచి వివిధ దేశాలకు వలస వచ్చే వాళ్లకు ధైర్యాన్ని కల్పిస్తోంది.  వారిని మానసికంగా బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నది.  ఆమె వారి గురించి ప్రసంగాలు చేస్తుంది.  వలస వచ్చిన వాళ్లకు సముచిత గౌరవం ఇచ్చి మానసికంగా బలవంతులుగా చేస్తే వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు.  లేదంటే వారిలో ఉగ్రతత్వం నిండిపోయి దేశానికి చేటు చేస్తారని అంటోంది.  ఇప్పటికి క్వీన్ వయసు 49 సంవత్సరాలు.  ఇంకా 20 లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది.  కారణం ఏంటి అని అడిగితె రోజు తప్పకుండా ఒక చాక్లెట్తింటానని.. అదే తన రహస్యం అని చెప్పింది క్వీన్.  


మరింత సమాచారం తెలుసుకోండి: