దేశం ఆర్ధిక మాంద్యం వైపు పయనిస్తోంది. దేశ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ప్రభావం అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నది. అయితే మిగతా రాష్ట్రాల్లో కంటే ఈ ప్రభావం తెలంగాణలో ముందే వచ్చేసినట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం రోజువారీ ఖర్చులు మినహా ఇంకా ఎలాంటి సాయం చేయలేనని కేంద్రం చేతులు ఎత్తేయడంతో తెలంగాణపై అప్పుల భారం పెను ప్రభావం చూపనుంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే రైతుబంధు పథకానికి ఈ ఆర్ధిక మాంద్యం దెబ్బ గట్టిగా తగలనుంది.


ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వానికి మెల్ల మెల్లగా భారంగా మారింది. ఈ పథకానికి డబ్బులు సర్దుబాటు చేయాలని పరిస్థితి తలెత్తుతోంది. దాంతో ఈ పథకానికి చిన్నగా ఆంక్షలు పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. కేసీఆర్ గతేడాది ఎన్నికల ముందు రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎకరానికి రూ. 4వేలు చొప్పున, రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ. 8 వేలు పంపిణీ చేశారు. 


ఎన్ని ఎకరాలు ఉన్న ఈ పథకం అమలు చేశారు. ఈ పథకం ఫలితంగానే కేసీఆర్ 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఎన్నికల్లో గెలిస్తే పంట సాయం రూ. 5 వేలు చొప్పున ఏడాదికి 10 వేలు ఇస్తామని కేసీఆర్ ప్రకటనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వంపై ఇంకా భారం పడిపోయింది. ఖరీఫ్ సీజన్‌లో రైతు బంధు పథకానికి సంబంధించి ఇంకా, 40శాతం రైతులకు సాయం అందలేదు. పైగా రబీ సీజన్ కూడా ముంచుకొస్తోంది. ఇటు ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ బాగా ఉంది. 


ఇలాంటి తరుణంలో రైతుబంధు పతాకంపై పరిమితులు పెట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక నుంచి రైతు బంధు పథకాన్ని కేవలం పది ఎకరాలకు మాత్రమే పరిమితం చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు, అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా వెళ్లాయని సమాచారం. దీనిపై త్వరలోనే  విధివిధానాలను ఖరారు చేసి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: