బిజెపి ప్రభుత్వం పైన కాంగ్రెస్ విమర్శలు చేయడం ఇదేమీ కొత్త కాదు. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ విశేషం ఏమిటి అంటే పది సంవత్సరాలు ప్రధాన మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు పెదవి విప్పి తన అభిప్రాయాలను వ్యక్త పరిచిన దాఖలాలు లేవు. కానీ ప్రతిపక్షానికి మారిన తర్వాత నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆయన విరివిగా మొదలుపెట్టారు. తాజాగా మోడీ పాలనలో ఎన్నో తప్పిదాలు జరిగాయి అని దాని నుంచి దేశం ఇంకా తేరుకోలేదు అని పేర్కొన్నారు.

భారతదేశ ప్రధాని కంటే ముందుగా ఆయన భారతదేశానికి తన సేవలను ఫైనాన్స్ మినిస్టర్ గా అందించిన విషయం అందరికీ తెలిసినదే. దేశ ఎకానమీ చాలా దెబ్బతింది అని అందుకు మోడీ గవర్నమెంట్ లో జరిగిన మానవ తప్పిదాలే కారణం అని నుంచి తేరుకోవడానికి ఎన్నో దశాబ్దాలు పట్టవచ్చు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులే తాజాగా వారం రోజుల క్రితం మోడీ పాలనలో జరిగిన ఎన్నో ఎకానమిక్ నిర్ణయాలు చాలా బాగా రాణించి అని దేశానికి ఎంతో మేలు జరిగింది అని పదేపదే మోడీని టార్గెట్ చేస్తూ ఇటువంటి విమర్శలు చేయడం వలన మనకే నష్టం అని వాపోయారు.

ఒకటే పార్టీలో ఇటువంటి విభిన్న అభిప్రాయాలు ఉండడం అనేది కాంగ్రెస్ అధికారిక నేతృత్వం యొక్క వీక్నెస్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఎకానమీ ఎలా ముందుకు సాగుతుందో అన్ని దేశాలు మెచ్చుకుంటూ ఉన్న తరుణంలో మన్మోహన్సింగ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది పొలిటికల్ గా టార్గెట్ చేయడమే అని తెలుస్తోంది.

అతి ముఖ్యంగా జి.ఎస్.టి ని అమలు చేయడం మరియు డిమానిటైజేషన్ యొక్క పరిణామాలను సరిగ్గా అంచనా వేయకపోవడం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తప్పిదాల నుంచి దేశం త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: