తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి పదవి నుంచి ఆయన్ను తప్పిస్తారని ప్రచారం జరగడం, తనకు మంత్రి పదవి బిక్ష కాదని ఈటల సంచలన వ్యాఖ్యలు చేయడం, గులాబీ జెండాకు తామే ఓనర్లమని ఉద్వేగంగా మాట్లాడడం, ఆ వెంటనే కేసీఆర్‌ని పొగడడం చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఉద్యమ సమయంలో కేసీఆర్ కంటే ఈటెల రాజేంద్ర ప్రసాద్, ఈటెల రాజేందరే ఎక్కువ కష్టపడ్డారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అరవింద్ అన్నారు. పసుపుపై రైతులు ఆందోళన చెందొద్దన అరవింద్.

 

బోర్డు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు అరవింద్.

 

దేశమంతటా ఎరువుల సరఫరా ఉందని, కానీ తెలంగాణ వ్యవసాయ మంత్రికి సోయి లేదని ధ్వజమెత్తారు. పసుపుపై రైతులు ఆందోళన చెందొద్దన అరవింద్.. బోర్డు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు అరవింద్.

మరింత సమాచారం తెలుసుకోండి: