పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించారు.  ఈ పార్టీని స్థాపించడానికి చాలా కష్టపడ్డాడు.  గతంలో 2008లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో అయన యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు సాధించింది. అయితే, వైఎస్  మరణం తరువాత జరిగిన అనేక పరిణామాల దృష్ట్యా  మెగాస్టార్ చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 


ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చాలా ఫీల్ అయ్యారు.  కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే.. మెగాస్టార్ తన పార్టీని తీసుకెళ్లి తిరిగి కాంగ్రెస్ లోనే విలీనం చేయడం ఆయనకు నచ్చలేదు.  దీంతో పవన్ కళ్యాణ్ పార్టీకి దూరంగా ఉన్నారు.  పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ పార్టీ ప్రజలతో మమేకం అవుతూనే ఉన్నారు.  పార్టీ పెట్టాలని పవన్ కు ఒత్తిడి మొదలైంది.  చాలాకాలం పాటు పవన్ కళ్యాణ్ పార్టీ గురించి ఆలోచించారు.  


అదే సమయంలో తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయే ముందు పవన్ పార్టీని స్థాపించారు.  అలా జనసేన పార్టీ ఆవిర్భవం జరిగింది.  ప్రజల నుంచి, అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పవన్ పార్టీ నిర్ణయం తీసుకున్నారు. అయితే, పార్టీని ఏర్పాటు చేసిన తరువాత అప్పుడే పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఉన్నట్టయితే.. గతంలోనే పవన్ తప్పకుండా గెలిచి ఉండేవారు.  ఈపాటికి పవన్ పార్టీ గ్రామాల్లో బలంగా పాతుకుపోయి ఉండేది. 


అప్పుడు పోటీ చేయకుండా ఉండటమే పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అని చెప్పొచ్చు.  పవన్ పార్టీని పెట్టిన తరువాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం కూడా పవన్ చేసిన తప్పుల్లో ఒకటిగా చెప్పొచ్చు. 2014లో పోటీకి దిగి ఉన్నట్టయితే కనీసం 20 స్థానాలు పవన్ గెలిచేవారు.  ఆ స్థానాలను నిలబెట్టుకొని రాజకీయాల్లో చక్రం తిప్పగలిగేవారు.  గతం గురించి అలోచించి ఇప్పుడు ప్రయోజనం లేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి వీలైనంతగా బలపడే విధంగా చర్యలు తీసుకోవాలి.  అప్పుడే విజయం సాధించే అవకాశం ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: