శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేయాలి అంటే.. అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉండాలి.  ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.  ఆరోగ్యం కోసం రోజు తప్పనిసరిగా యోగ, వ్యాయామం వంటివి చేస్తుంటారు.  దీనితో పాటుగా మంచి ఆహరం తీసుకుంటారు.  అయితే, తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన పోషకపదార్ధాలు ఉన్నాయా.. లేవా అనే విషయం చూసుకొని తీసుకోవాలి.  ఎందుకంటే.. శరీరానికి కావలసిన పోషకాలు లేకపోతె.. ఆ ఆహారం తీసుకోవడం వలన ప్రయోజనం ఉండదు.  పైగా ఇబ్బందులు ఎదురౌతాయి.  ఇక శరీరానికి అవసరమైన విటమిన్లలో కె విటమిన్ ఆవశ్యకత ఎంతో ఉన్నది.  కె విటమిన్ అనగానే మనకు రక్తం గడ్డకట్టేందుకు ఉపయోగపడుతుంది అని చెప్తారు.  కె విటమిన్ వలన ఇదొక్కటే ఉపయోగం కాదు.  దీనితో పాటు అనేక ఉపయోగాలు ఉన్నాయి.  అవేంటో ఇప్పుడు చూద్దాం.  


  1. రక్తం గడ్డకట్టడం : సహజంగా గాయం కాగానే వెంటనే రక్తం బయటకు వస్తుంది. ఒకటి లేదా రెండు నిమిషాల్లో ఆ గాయం చుట్టూ ఒక లేయర్ ఏర్పడి.. రక్తం గడ్డకట్టడంతో తోడ్పడుతుంది.  రక్తం గడ్డకట్టడంలో కె విటమిన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ కే సరిపడా లేకపోతె రక్తం గడ్డకట్టదు.  దీనినే మైఎల్డోప్లాస్టిక్ సిండ్రోమ్ అంటారు.  


2. ఎముకలకు బలం : శరీరంలో ఎంత బలమైన కండరాలు ఉన్నా.. వాటికి పటుత్వాన్ని ఇవ్వడంలో తోడ్పడేవి మాత్రం ఎముకలు.  శరీరానికి ఒక ఆకృతిని ఇచ్చేవి ఎముకలు.  సహజంగా మనిషిలో 206 ఎముకలు ఉంటాయి.  ఎముకలు బలంగా ఉండాలి అంటే క్యాల్షియం అవసరం ఎంతైనా ఉంది.  క్యాల్షియం లేకుంటే.. ఎముకలు పెళుసుగా మారి విరిగే అవకాశం ఉంటుంది. అయితే, ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం తో పాటుగా విటమిన్ కె కూడా సహాయపడుతుంది అని తాజా పరిశోధనలో తేలింది.  ఎముకలు బలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా విటమిన్ కే ను తీసుకోవాల్సిందే.  


3. గుండె ఆరోగ్యానికి : శరీరంలో అన్నింటికన్నా ముఖ్యమైన అవయవం గుండె.  శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి.. చెడు రక్తాన్ని మంచి రక్తంగా గుండె మారుస్తుంది.  ఇక మారుతున్న జీవన విధానంలో మన అలవాట్ల కారణంగా గుండె జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది.  తీసుకునే ఆహారంలో సమతుల్యత లోపించడం.. కొలెస్ట్రాల్ కలిగిన ఆహరం తీసుకోవడం వంటి వలన రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.  ఫలితంగా రక్తపీడనం పెరుగుతుంది.  ఈ ప్రభావం గుండెపై పడటంతో.. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.  దీని నుంచి బయటపడాలి అంటే గుండెపై ఒత్తిడి తగ్గాలి.  గుండెపై ఒత్తిడి తగ్గించడంలో విటమిన్ కే ఎంతగానో సహాయపడుతుంది.  రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ ను వీలైనంతగా తగ్గించడంలో విటమిన్ కే సహాయపడుతుంది.  


4. క్యాన్సర్ నుంచి విముక్తి : క్యాన్సర్.. మారుతున్న జీవన విధానం, కాలుష్యం తీసుకునే ఆహరంలో మార్పుల కారణంగా క్యాన్సర్ బారిన పడుతుంటారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నట్టు వెల్లడించింది.  సరైన పద్దతిలో ఆహరం తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు.  అంతేకాదు, ఆహారంలో పోషకాలతో పాటు విటమిన్ కె కూడా ఉండే విధంగా చూసుకోవాలి.  కోలన్, స్టొమక్, లివర్, ఓరల్, ప్రోస్టేట్ తదితర క్యాన్సర్ కణాలపై విటమిన్ కే సమర్ధవంతంగా పోరాటం చేస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: