ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో టీడీపీ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు చేసిన వ్యాఖ్యాలు క‌ల‌కలం రేపుతున్నాయి. ఉప్పు నిప్పుగా ఉన్న పార్టీల‌న్నీ ఏక‌మై అధికార వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నాయా ? అనే సందేహాలు అయ్య‌న్న‌పాత్రుడి మాట‌ల‌తో క‌లుగుతున్నాయి. వాస్త‌వానికి అయ్య‌న్న‌పాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యాలు టీడీపీ ఆధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌దిలో ఉన్న‌మాట‌లేనా ? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 


అయితే టీడీపీ ఇప్ప‌టి నుంచే 2024 ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతుంద‌నే టాక్ అయ్య‌న్న‌పాత్రుడి మాట‌ల‌తో తేట‌తెల్లం కాగా, 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సార్ పార్టీని ఓడించేందుకు జ‌న‌సేన‌తో టీడీపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్న‌ట్లు తేలిపోయింది. ఇంత‌కు అయ్య‌న్న‌పాత్రుడు చేసిన కీల‌క వ్యాఖ్యాలు ఏంటి అనేది ఓసారి చూద్దాం.. 2024 ఎన్నిక‌ల్లో టీడీపీ బీజేపీ, జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేస్తుంద‌ని మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు జోస్యం చెప్పాడు. 


దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌మిలి ఎన్నిక‌లు రానున్నాయ‌ని, దీంతో ఏపీలో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేసి వైఎస్సార్ పార్టీని ఓడిస్తాయ‌ట‌. ఇవి అయ్య‌న్న‌పాత్రుడు చెప్పిన జోస్యం.. అంటే గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన, బీజేపీ సోప‌తితో టీడీపీ పోటీ చేసింద‌ని, టీడీపీ అధికారం కోసం లోపాయికారి ఒప్పందం చేసుకుంద‌ని అయ్య‌న్న‌పాత్రుడి మాట‌లు బ‌లం చేకూరుస్తున్నాయి. 


దీనికి తోడు మంగ‌ళ‌గిరిలో చంద్ర‌బాబు కొడుకు మాజీ మంత్రి లోకేష్‌ను గెలిపించే బాధ్య‌త జ‌న‌సేన నెత్తికెత్తుకొని పోటీ చేయ‌లేద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న త‌రుణంలో అయ్య‌న్న‌పాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యాలు నిజం చేస్తున్నాయి. ఇటీవ‌ల న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరింది కూడా టీడీపీని కాపాడి, రాబోవు ఎన్నిక‌లో పొత్తులు కుదిర్చేందుకే అనే అప‌వాదు ఉంది. సో వైసీపీ చేస్తున్న వాద‌న‌కు అయ్య‌న్న‌పాత్రుడు చేసిన వ్యాఖ్యాల‌తో బ‌లం చేకూరిన‌ట్లే...


మరింత సమాచారం తెలుసుకోండి: