ఆసియా దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందతున్న దేశం భారత్. ఇందులో ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం ఎంతో ముఖ్యం. ఆయా దేశాలతో సత్సంబంధాలు నెరవడం ద్వారా ప్రపంచ దేశాల్లో మన బలం చాటుకునే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు తమ హోదాలో పలు దేశాల్లో పర్యటించడం ద్వారా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగవుతాయి. ఇందులో భాగంగానే తూర్పు ఆసియా దేశాల్లో ఐదు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బయలుదేరి వెళ్లారు.

 

 

పర్యటనలో మొదటగా సోమవారం ఆయన జపాన్ చేరుకున్నారు. ఈ విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆయన జపాన్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య రక్షణపరమైన, వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ పర్యటనలో ఆయన జపాన్ ప్రధాని షింజో అబేను కలుసుకుంటారని సమాచారం. ఐదేళ్ల కాలంలో జపాన్ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని మోదీ మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతున్నట్టు ఆయన తెలిపారు.

 


జపాన్ పర్యటన అనంతరం సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దక్షిణకొరియాలో ఆయన పర్యటించనున్నారు. పర్యటనలో ఆ దేశ రక్షణ మంత్రి జియోంగ్ కియోంగ్ తో సమావేశాల్లో పాల్గొంటారు. పర్యటనలో ఆ దేశ ప్రధాని లీనాక్ యోన్ ను కలవనున్నారని సమాచారం. భారత రక్షణ పరిశ్రమ, దక్షిణ కొరియా రిపబ్లిక్ మధ్య సహకారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పర్యటన జరుగనుంది. ఇందులో భాగంగా సియోల్ లో జరిగే బిజినెస్ టు గవర్నమెంట్ సీఈవోల సదస్సులో ఇరు దేశాల రక్షణ మంత్రులు పాల్గొననున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: