కోడి పెంచుతుంటే గుడ్డు పెడుతుంది.   ఆదాయం ఇస్తుంది.  అదే కొస్తే చికెన్ ఇస్తుంది.. అమ్మితే డబ్బు వస్తుంది.. తింటే శక్తిని ఇస్తుంది.  మందులో నంజుకుంటే యమా రంజుగా ఉంటుంది.  కానీ,  చనువిచ్చింది కదా అని చెప్పి తన ఉన్న గుడ్డును బలవంతంగా లాక్కోవాలని చూస్తే.. పొడిచి పొడిచి ప్రాణాలుతీస్తుంది.  కోడేంటి ప్రాణాలు  తీయడం ఏంటి.. ఇదేమైనా బాలకృష్ణ సినిమా అనుకున్నారా అని షాక్ అవ్వాకండి.  


బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో బాలకృష్ణ కు చెందిన చిన్న మల్లన్న కోడి విలన్ ను తన   కాళ్లకున్న కత్తులతో చంపుతుంది.  కానీ, ఈ కోడి మాత్రం ముక్కుతో పొడిచి చంపుతుంది.  ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.  ఆస్ట్రేలియాలో ఓ ఇంట్లో కోడిని పెంచుతున్నారు.  ఆ ఇంట్లో ఉండే ఓ వృద్ధ మహిళ ఎప్పటిలాగే కోడి దగ్గరకు వెళ్లి గుడ్లు తీయబోయింది.  


అంతే ఆ కోడికి ఎక్కడా లేని కోపం వచ్చింది.  పెద్దగా అరుస్తూ.. ఆ మహిళపై దాడి చేసింది.  పదునైన ముక్కుతో విపరీతంగా పొడిచేసింది.  శరీరమంతా గాయాలయ్యాయి.  దీంతో తీవ్రమైన రక్తస్రావం జరిగి ఆ మహిళ మరణించింది.  ఈ వార్తా తెలుసుకున్న పోలీసులు మొదటి షాక్ అయ్యారు.  వెంటనే ఆ ఇంటికి వచ్చి విచారణ చేశారు.  కొన్ని పెంపుడు జంతువులు ఒక్కోసరి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయని, పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.  


కోడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.  విచిత్రం అంటే ఇదే మరి.  కోడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఏం చేస్తారు.  దాన్ని ఎలా విచారిస్తారు.  ఆ కోడి ఏం చెప్తుంది.. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కోడి విషయంలో ఆస్ట్రేలియా పోలీసులు, న్యాయస్థానం ఏం చేయబోతున్నది అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   దానికి శిక్ష వేస్తారా.. లేదంటే మరణదండన పేరుతో కోసుకొని తినేస్తారా.. చూద్దాం.  ఎలా చేస్తారో.  మొత్తానికి సౌమ్యంగా ఉండే కోళ్లు కూడా హత్యలు చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: