వర్షాకలం వచ్చిందంటే రైతులు పాములకు బయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా కృష్ణా జిల్లాలో పాములకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు . ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పాము కాట్లు ఆగటం లేదు , దివిసీమ అవనిగడ్డ ప్రాంతంలో వర్షాకాలం ప్రారంభం నుంచి పాము కాట్లు ఎక్కువగా ఉన్నాయి . దీంతో రైతులు , రైతు కూలీలు పొలాల వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా నాగాయలంక మండలం పెదపాలెం గ్రామానికి చెందిన నలభై ఏళ్ళ మహిళ పాము కాటుకు గురి అయ్యి మృతి చెందింది .


ఈ రోజు ఉదయం బొడ్డు నాగేశ్వరమ్మ ఆరుబయట నిద్రిస్తూ ఉండగా పాము కాటు వేసింది . కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్తూ ఉండగా మార్గమధ్య లోనే ఆమె మృతి చెందింది. అవనిగడ్డ లో పాముకాటు మృతుల సంఖ్య ఈ సీజన్ లో పది కి చేరింది. ఏపీలో తీర ప్రాంతం వెంట ఉండే పట్టణాలు, గ్రామాలలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. వర్షాలు వల్ల నీరు ఎక్కువగా చేరడంతో సముద్ర తీరం లోని అటవీ ప్రాంతం నుంచి గ్రామాలలోకి వివిధ రకాల పాములు ప్రవేశిస్తూ ఉంటాయి .


ముఖ్యంగా కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో పాము కాట్ల ప్రభావం ఎక్కువగా ఉంది . ఏటా వందల సంఖ్య లో జనం పాము కాట్లకు గురవుతున్నారు . వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్ళే రైతులూ , రైతు కూలీలు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇతరత్రా పనుల కోసం రోడ్ల పై తిరిగే జనం సైతం పాముల కాట్ల బారిన పడుతున్నారు . ఈ ఏడాది జిల్లాలో పాము కాట్ల బారిన పడిన వారి సంఖ్య పద్నాలుగు వందలకు పైగా చేరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: