శంలో ఇప్పటికే పూర్తిగా మోదీ షా ద్వయం నడిపిస్తున్నారు.దేశంలో కొన్ని రాష్ట్రాలు తప్ప ... మిగితా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతుంది . కాగా మిగితా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ని అధికారంలోకి తెచ్చేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతుంది .ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసి మాకు తెలంగాణలో తిరుగే లేదు అనుకుంటున్నా తెరాస కి బీజేపీ ఈ మధ్య కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది . ఇప్పటియికే పార్లమెంట్ ఎలెక్షన్లలో ఊహించిన విదంగా ... ఫుల్ జోష్ లో ఉన్న తెరాస ని వెనక్కి నెట్టి బీజేపీ నాలుగు సీట్లు గెలిపించుకుంది . ఏకంగా కెసిఆర్ కూతురు కవితనే ఓటమి పాలయ్యే సరికి అందరు షాక్ కి గురయ్యారు. 


ఒకప్పుడు బీజేపీ తో స్నేహ పూర్వక సంబంధాలు కలిగి ఉన్న తెరాస ... చాలా కాలంగా అంటి ముట్టినట్టుగానే ఉంటోంది . ఇక తెరాస అధినేత కెసిఆర్ గత పార్ల మెంట్ ఎలెక్షన్లలో బీజేపీ ని ఓడించటానికి ఫెడరల్ ఫ్రెంట్  ఏర్పాటు చేసేందుకు సర్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. బీజేపీ రికార్డు స్థాయి మెజారిటీ సాధిస్తూ విజయ  డంకామోగించింది .కాగా  తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావటానికి కూడా ఇప్పటి నుండే పావులు కదుపుతుంది .. 


మొన్నటి వరకు  బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా పర్యటనలో చేసిన విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి .తెలంగాణాలో బీజేపీ ప్రత్యామ్నాయమని నడ్డా పర్యటన చెప్పగానే చెప్పింది. ఇక పలువురు నేతలను ఆకర్షిస్తూ వాళ్ళని  బీజేపీ లోకి ఆహ్వానిస్తూ బీజేపీ తన బలాన్ని  పెంచుకుంటుంది.ఈ నేపథ్యంలోనే  బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ గా  తమిళసై సౌందర్య రాజన్  ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది . ఈ నిర్ణయం కూడా ఓ వ్యూహం తోనే అమలు చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పటి వరకు రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తెరాస ఒక్కసారి కూడా మహిళలకి మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు  . మహిళలను తెరాస ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ ప్రజల్లో ఓ  అంశం బలంగా నాటుకుపోయింది .


ఈ నేపథ్యంలోనే మహిళా గవర్నర్ ని నియమించి మహిళలకు  బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తుందని  ప్రజలకు తెలియ చేయాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు  తెలుస్తుంది . అయితే  మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలకి గవర్నర్ గా కొనసాగిన నరసింహన్  ఎవ్వరికి ఇబ్బంది కలిగించకుండా ... సున్నితంగా తన పని తాను చేసుకుంటూ సంతకాలు చేశారు. మరి నూతన గవర్నర్ గా నియమితులైన బీజేపీపార్టీ కి వీర విధేయురాలైన   తమిళసై సౌందర్య రాజన్ వల్ల  కెసిఆర్ కి  ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు  భావిస్తున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: