రాష్ట్రంలో ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు చుట్టూ.. ఇప్పుడు అనేక ప్ర‌శ్న‌లు ముసురుకున్నాయి.  ప్ర‌స్తుతం బాబు ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి.. ఆయ‌న‌కు పోరాటం చేసే హ‌క్కు ఉంటుంద‌నేది వాస్త‌వం. వాస్త‌వానికి ప్ర‌తిప‌క్షంగా ఆయ‌న చేయాల్సింది కూడా ప్ర‌జా గ‌ళాన్ని ప్ర‌భుత్వానికి వినిపించ‌డ‌మే. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తు న్నారు. ఇటీవ‌ల జీతాలు విడ‌ద‌ల చేస్తామ‌ని చెప్పినా.. ఆశా వ‌ర్క‌ర్ల‌ను టీడీపీ నేత‌లు రెచ్చ‌గొట్టారు. వారం తా రోడ్ల మీదికి వ‌చ్చి నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. 


ఇంత‌లోనే జ‌గ‌న్ వారికి ఇవ్వాల్సిన మొత్తంగా ఆరు నెల‌ల బ‌కాయిల‌ను విడుద‌ల చేశారు. దీంతో చంద్ర‌బాబు వ్యూహం పార‌లేదు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న అమ‌రావ‌తిపై వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో మూడున్నర నెలల్లో వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ఆస్తుల ధ్వంసం, భూముల కబ్జాలు, సామూహిక దా డులు, వేధింపులు, అక్రమ కేసులకు లెక్కేలేదన్నారు. ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు అందరికి ఉంద ని చంద్రబాబు పేర్కొన్నారు. 


దేశంలో నివసించే హక్కును ఎవరూ కాలరాయలేరని.. ఆస్తులకు, ప్రాణాల కు భద్రత కల్పించాల్సింది పోలీసులేనన్నారు. పోలీసులే నిస్సహాయులైతే పరిస్థితులు ఇలాగే ఉంటా యన్నారు.  వైసీపీ బాధితులకు టీడీపీ అండగా ఉం టుందన్నారు. అందులో భాగంగానే గుంటూరులో వైసీపీ బాధితు ల పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన ట్టు తెలిపారు. బాధితులంతా గుంటూరు శిబిరానికి తరలి రావాల న్నారు. అవసరమైతే తానే స్వయంగా బాధితులను వాళ్ల గ్రామాలకు తీసుకుని వెళతానన్నారు. 


అయితే, వాస్త‌వానికి చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా ఈ ప‌రిస్థితి ఉందా?  విప‌క్షాలు ఇలాంటి వ్యాఖ్య‌లు చేసినా.. చంద్ర‌బాబు త‌ట్టుకునేవారు కాదు.. అస‌లు నిర‌స‌న అంటేనే ఉవ్వెత్తున లేచిప‌డేవారు. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు త‌న దాకా వ‌చ్చే స‌రికి ప‌రిస్తితిని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని.. ఉద్య‌మాలంటూ. వ్య‌వ‌హ‌రించ‌డంపై టీడీపీలోని కొంద‌రు నాయ‌కులే న‌వ్విపోతున్న ప‌రిస్తితి క‌నిపిస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: