ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌దాని నిర్మించేందుకు తెచ్చిన నిధుల‌ను టీడీపీ ప్ర‌భుత్వం ఏమీ చేసింది... అస‌లు వ‌చ్చిన నిధులెన్ని.. ఖ‌ర్చు చేసిన నిధులెన్ని.. దేని కోసం నిధులు ఖ‌ర్చు చేసారు.. చేసిన ఖ‌ర్చుకు నిర్మాణాలు జ‌రిగిన భ‌వ‌నాలు ఎన్ని.. వాటి ప‌రిస్థితి ఏంటిది వంటి ఆంశాల‌ను ఆరా తీస్తుంది సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఇప్పుడు రాజ‌దాని నిధుల మ‌ళ్ళీంపు పై జ‌గ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని ముందుకు పోతున్నాడ‌ట‌. టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో రాజ‌ధాని పేరుతో గార‌డీలు చేశాడు. ఏకంగా ఓ మాయ ప్ర‌పంచాన్నే సృష్టించాడు. 


అమ‌రావ‌తి నిర్మాణం ప్ర‌పంచ వింత‌ల్లో ఒక వింత‌గా చేస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికాడు.. అందుకు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి రైతుకు క‌డుపునింపే పంట భూముల‌ను న‌యానో భ‌యానో సేక‌రించాడు. ఇక నిర్మాణాల కోసం వ్య‌వ‌స్థాగ‌త రుణాలు తీసుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. అందులో భాగంగా బీఎస్ఈలో అమ‌రావ‌తి బాండ్ల లిస్టింగ్ కార్య‌క్ర‌మంను ముంబైలో చంద్ర‌బాబునాయుడు ద‌గ్గ‌రుండి పాల్గొన్నాడు. దీనికి మంచి గిరాకే త‌గిలి నిధులు సుమారు రూ.2వేల కోట్లు వ‌చ్చాయ‌ని, వీటిని సీఆర్‌డీఏ స‌మీక‌రించిన‌ట్లు ప్ర‌భుత్వం వ‌ద్ద  స‌మాచారం ఉంది. 


ఇక ప్ర‌పంచ బ్యాంక్‌, ఆసియా బ్యాంక్‌ల నుంచి కూడా భారీ స్థాయిలో రుణాలు తీసుకునేందుకు బాబు సంప్ర‌దింపులు జ‌రిపారట‌. ఈ వ‌చ్చిన నిధుల‌ను ఎటు మ‌ళ్లించారో తెలుసుకునేందుకు ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వ మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ దృష్టికి రావ‌డంతో నిధుల‌పై ఆరా తీస్తున్నాడ‌ట‌. ఇక బిల్లులు చెల్లించాలంటే సుమారు రూ.2800 కోట్లు కావాల‌ట‌. ఇలా చెల్లించాలంటే ప్ర‌భుత్వం పై భారం ప‌డుతుంద‌ట‌. అందుకే అస‌లు నిధులేమ‌య్యాయో లెక్క తేలాకే ముందుకు పోవాల‌ని స‌ర్కారు భావిస్తుంద‌ట‌. ఇప్పుడు స‌ర్కారు లెక్క‌లు తీస్తుండ‌టంతో ప్ర‌తిప‌క్ష నేత‌లు హ‌డ‌లిపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: