కొన్ని వాస్తవ సంఘటనల గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది. మూడు సంవత్సరాల వయస్సులో తాతకు, తనకు ఆహారం కోసం వంటపని చేసింది ఓ చిన్నారి. ఇంత చిన్న వయస్సులో చిన్నారి జ్యోతి వంటపని చేస్తూ ఉన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా ఆసుపత్రిలో జ్యోతి అనే మూడేళ్ళ చిన్నారి తండ్రి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో తన తండ్రిని చూసుకోవటానికి జ్యోతితో పాటు ఆమె తాత కూడా అక్కడే ఉన్నాడు. ఆసుపత్రిలో రోగులకు ఉచితంగానే భోజనం లభిస్తుంది. కానీ రోగి బంధువులకు మాత్రం భోజనం ఆసుపత్రి అందించదు. ఆహారం కోసం అక్కడికి వచ్చిన రోగుల బంధువులు ఆసుపత్రి పార్కింగ్ స్థలంతో ఇటుకలతో కూడిన పొయ్యిలను ఏర్పాటు చేసుకొని వంట చేసుకొంటారు. 
 
జ్యోతి సొంతూరికి దంతేవాడ జిల్లా ఆసుపత్రికి 38 కిలోమీటర్ల దూరం ఉండటంతో జ్యోతి మూడు రోజుల నుండి తాతతో పాటు ఆసుపత్రి దగ్గరే ఉంది. జ్యోతి తాత తనకు, మనవరాలికి భోజనం కొరకు ఇటుకలతో కూడిన పొయ్యిని ఏర్పాటు చేసి ఆహారం ఉడుకుతున్న సమయంలో కొడుకుకు ఆసుపత్రి అందించే భోజనం ఇవ్వటానికి మంట తగ్గకుండా చూడమని చిన్నారి జ్యోతికి చెప్పాడు. 
 
తాత చెప్పటంతో జ్యోతి కట్టెలపొయ్యిలోని మంట తగ్గకుండా కట్టెల పొయ్యి ఊదటంతో పాటు ఉడుకుతున్న ఆహారాన్ని గరిటె సహాయంతో కలుపుతూ ఉంది. మూడేళ్ళ వయస్సులో చిన్నారి జ్యోతి వంట పని బాధ్యతలు తీసుకున్న దృశ్యం స్థానికుల హృదయాలను కలచివేసింది. తాత అక్కడికి మరలా తిరిగివచ్చేవరకు జ్యోతి తాత చెప్పిన పనిని చేస్తూనే ఉంది. ఆసుపత్రిలో ఉన్న తండ్రి కోసం, వృధ్ధాప్యంలో ఉన్న తాత కోసం ఇంత చిన్న వయస్సులో జ్యోతి కష్టపడుతూ ఉండటం అభినందనీయం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: