అతి సర్వత్రా వర్జయేత్ అంటారు.  ఎందులోనూ అతి చేయకూడదు.  అతిగా చేయడం వలన చాలా ఇబ్బందులు వస్తాయి.  ఏ విషయంలోనూ అతిగా ప్రవర్తించకూడదు.  మితంగా తింటే ఆరోగ్యం అతిగా తింటే అనారోగ్యం.  ఇటీవల కాలంలో తినే విషయంలో కంట్రోల్ ఉండటం లేదు.  ఇష్టం వచ్చిన ఫుడ్ ను ఇష్టం వచ్చినట్టుగా తింటున్నారు.  కావాల్సినవి ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని తింటున్నారు.  చిరుతిండ్లు, ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.  


జంక్ ఫుడ్స్ మనిషిని ఎంతగా నాశనం చేస్తాయో చెప్పక్కర్లేదు.  నోటికి రుచిగా ఉంటూ.. తినేకొద్దీ ఇంకా తినాలనిపించే విధంగా ఉండటంతో వీటివైపు మనిషి పరుగులు తీస్తున్నాడు.  ఇలా చేయడం వలన వచ్చే ఇబ్బందులు దారుణంగా ఉంటాయి.  లండన్ కు చెందిన ఓ యువకుడు జంక్ ఫుడ్ ను విపరీతంగా తినడం మొదలుపెట్టాడు.  తన 13 సంవత్సరం నుంచి జంక్ ఫుడ్ ను తినడం అలవాటు చేసుకున్నాడు.  


ఆ అలవాటు ఎలా మారిపోయింది అంటే.. జంక్ ఫుడ్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోయాడు.  ఆ ఫుడ్ అతనిపాలిట శాపంగా మారింది.  17 సంవత్సరం వచ్చే సరికి లావుగా మారిపోయాడు.  మధుమేహం వంటి వ్యాధులబారిన పడ్డాడు.  క్రమంగా చూపు మందగించింది.  దీంతో అతన్ని వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు.  హాస్పిటల్ లో చూపిస్తే.. మందులు ఇచ్చారు.  ఆ తరువాత కూడా ఆ యువకుడు జంక్ ఫుడ్ తినడం ఆపలేదు.  


చివరకు 17 ఏళ్ళ వయసులోనే ఆ యువకుడు కంటిచూపును కోల్పోవాల్సి వచ్చింది.  శరీరంలో అలసట, బి 12 విటమిన్ లోపం వంటివి శరీరంలో క్రమంగా పెరిగిపోయాయి.  రక్తహీనతతో బాధపడుతున్నాడు.  ఇలాంటి సమయంలో మరోసారి ఆ యువకుడు హాస్పిటల్ కు వెళ్ళాడు.  అతనిని పరీక్షించిన వైద్యులు జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వలనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా జంక్ ఫుడ్ నుంచి బయటకు రావాలని సూచించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: