ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు . అయితే ఒకవైపు  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్ణయాన్ని ఆక్షేపిస్తూనే ... మరొకవైపు  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్ణయాన్ని అభినందించడం చంద్రబాబు ద్వంధ వైఖరిని తెలియజేస్తోందని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు విరుచుకుపడుతున్నారు . యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ   కేంద్ర ఆర్థిక మంత్రి   నిర్మల సీతారామన్ కు చంద్రబాబు ఒక  లేఖ రాశారు.


ఆంధ్రాబ్యాంక్ విలీనాన్ని తెలుగు ప్రజలు స్వాగతించారు లేకపోతున్నారని   ఆయన తన  లేఖలో పేర్కొన్నారు .విలీనం అనివార్యమైతే ఆంధ్రబ్యాంక్ పేరును యధావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు . ఇంతవరకూ అంతాబాగానే.... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకున్న చర్యలు అభినందనీయమని పేర్కొనడం ఏమిటని అన్న ప్రశ్న తలెత్తుతోంది .  ఒకవైపు ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని  తీవ్రంగా ఆక్షేపిస్తూనే , మరొకవైపు  ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తీసుకున్న చర్యలని చంద్రబాబు సమర్ధించడం లో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది . అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు , మరొకసారి ఆ పార్టీ నాయకత్వాన్ని మచ్చిక చేసుకునేందుకే ఒకవైపు ఆంధ్రాబ్యాంక్ విలీనం పై అభ్యంతరం వ్యక్తం  చేస్తున్నట్లుగా ప్రజలను నమ్మిస్తూనే, మరొకవైపు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని అభినందించడం ద్వారా , ఆ పార్టీకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి .


రాష్ట్రం లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయిన తరువాత టీడీపీ కి చెందిన నల్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీ లో చేరిన విషయం తెల్సిందే .వీరంతా బాబు ఆశీస్సులతోనే బీజేపీ లో చేరినట్లుగా ప్రచారం జరుగుతోంది . ఇప్పుడు బాబు , ఆర్ధిక మంత్రి కి రాసిన లేఖ ఆ వాదనలకు బలం చేకూర్చుతోంది రాజకీయ పరిశీలకులు అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: