ఒకే రోజు రెండు వార్తలు.. ఈ రెండూ పాకిస్తాన్ ను హడలెత్తించేవే.. భారత్ కు మరింత ఉత్సాహాన్నిచ్చేవే.. ఓవైపు కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో భారత్- పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్న వేళ ఈ రెండు వార్తలు భారత్ కు ఆనందాన్నిస్తున్నాయి.


ఇంతకీ అవేంటో చూద్దాం.. మొదటిది.. ప్రపంచంలోనే అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లు భారత వాయుసేనలో చేరాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ.. నాలుగు హెలికాప్టర్లను భారత్ కు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరో 8 అపాచీ ఏహెచ్-64ఈ హెలికాప్టర్లను భారత వాయుసేనకు అందించింది.


పఠాన్ కోట్ వైమానిక కేంద్రంలో.. భారత వాయుసేన నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈయుద్ధ విమానాలను ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఆధ్వర్యంలో బోయింగ్ సంస్థ అపాచీ యుద్ధ హెలికాప్టర్లను భారత వాయుసేనకు అందజేసింది. ఐఏఎఫ్  చీఫ్ బీ ఎస్ ధనోవా ఆధ్వర్యంలో హెలికాప్టర్లకు పూజలు నిర్వహించారు. జల ఫిరంగులతో వాయుసేన సైనికులు ఈ కొత్త అపాచీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తా సెరిమోనియల్ కీ ని ధనోవాకు అందజేశారు.


ఇంకా మరో పది అపాచీ హెలికాప్టర్లు భారత్ కు రావాల్సి ఉంది. భారత వాయుసేన 2015 సెప్టెంబర్ లో ఈ అపాచీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. భారత్ కు మొత్తం 22 అపాచీ ఛాపర్ల కొనుగోలు కోసం ఒప్పందం కుదిరింది. ధర బిలియన్ డాలర్లు. మిగిలిన పది హెలికాప్టర్లు అందించేందుకు అపాచీకి 2022 వరకూ గడువు ఉంది.


మరో శుభవార్త ఏంటంటే.. రఫేల్ యుద్ధ విమానాలు ఎట్టకేలకు వైమానిక దళ అమ్ములపొదిలో చేరనున్నాయి. ఈ నెల 19న ఫ్రాన్స్ తొలి రఫేల్ విమానాన్ని భారత్ కు అప్పగించనుంది. మొదట ఒక విమానాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మిగతా నాలుగు యుద్ధవిమానాలు వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ లో అందనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: