ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక తెలంగాణా ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎంపికయ్యారు.  2014 ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయం సాధించారు.  అటు మరో తెలుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు.  మొదట్లో చంద్రబాబు, కెసిఆర్ మధ్య సఖ్యత ఉన్నది.  ఎప్పుడైతే నోటుకు ఓటు కేసు నమోదైందో అప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరిగింది.  ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎదురెదురుగా కలుసుకోలేకపోయారు.  


ఆ తరువాత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది.  తెలంగాణాలో తెరాస అధికారంలోకి వచ్చింది.  అటు ఏపీ లో వైకాపా అధికారం చేజిక్కించుకుంది.  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే జగన్ అనేక వరాలు ఇచ్చారు.  నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రకటించారు.  ప్రకటించినట్టుగానే ఆగష్టు 15 నుంచి 2 లక్షల 50వేలమంది గ్రామ వాలంటీర్ల నియామకం జరిగింది.  .


అంతేకాదు, ఇటీవలే గ్రామ సచివాలయ పోస్టులకు పరీక్షలు కూడా నిర్వహించారు.  పధకాలు అమలు చేస్తున్నారు.  అంతేకాదు, మద్యపాన నిషేధం విషయంలో చెప్పినట్టుగా అన్నింటిని అమలు చేస్తున్నారు.  ఇలా అమలు వరసగా అన్ని అమలు చేస్తుండటంతో.. ప్రజలు జగన్ పై సంతృప్తితో ఉన్నారు.  ఇది కెసిఆర్ ను ఇబ్బంది పెడుతున్నది.  ఉద్యోగాల కల్పనలో తెలంగాణ వెనకబడి ఉన్నది. 


అలానే ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు.  ఇప్పటికే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.  ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేసే అవకాశం కనిపిస్తోంది.  అంతేకాదు, ఆశా వర్కర్ల జీతాలను  3 వేల నుంచి 10వేలకు పెంచుతూ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు.  జగన్ తో దోస్తీ చేస్తున్న కెసిఆర్ కు ఈ పథకాలన్నీ ఇరుకున పెట్టె విధంగా మారిపోతున్నాయి.  మరి దీనిపై కెసిఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: