సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి దేశంలో మోటార్ వాహన చట్టం అమలులోకి వచ్చింది.  ఈ చట్టం అమలులోకి రావడంతో.. చలానాలు మోత మోగిపోతున్నది.  రూల్స్ ప్రకారం అన్ని ఉంటేనే అనుమతి ఇస్తున్నారు.  లేదంటే మాత్రం భారీ పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది.  ఇటీవలే దేశరాజధాని ఢిల్లీలో పోలీసులు మోటార్ బైక్ ను చెక్ చేసి.. 23వేలరూపాయల ఫైన్ వేశారు.  ఆ బండి ఖరీదు కేవలం 15వేలరూపాయలు మాత్రమే అని. అంత ఫైన్ కట్టడం తన వల్లకాదని చెప్పి వాపోయాడు.  


ఇది జరిగిన రెండో రోజు ఒరిస్సాలో ఆటోను ఇలాగే చెక్ చేసి 47వేలరూపాయలు ఫైన్ వేశారు.  దీంతో ఆ ఆటో వ్యక్తి లబోదిబో అన్నాడు.  ఇంతింత చలానాలు పెడితే ఎలా కడతాం అని ప్రశ్నిస్తున్నారు వాహనదారులు.  చలానా కట్టకుండా ఉండాలి అంటే.. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, నిబంధనలు పాటించని వ్యక్తులకు ఫైన్ తప్పదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్న సంగతి తెలిసిందే.  


ఫైన్ కట్టని భారత దేశాన్ని చూడాలని ఉందని అన్నారు.  పోలీసులు చెక్ చేస్తూ ఫైన్ వేస్తుంటే.. దాని నుంచి తప్పించుకోవడానికి కొంతమంది కొన్ని రకాల ప్లాన్స్ వేస్తున్నారు.  చలానా కట్టకుండా ఉండాలని చెప్పి.. పోలీస్ చెకింగ్ జరిగే కొంత దూరం ముందు బండిని ఆపేసి.. తోసుకుంటూ వెళ్తున్నారు.  బండిని నడుపుతూ పట్టుకుంటే అన్ని చూపించాలి.  లేకుంటే ఫైన్ వేయాలి.  కానీ, తోసుకుంటూ వెళ్లే సమయంలో ఆపడానికి వీలులేదు.  


అందుకే చాలామంది ఈ రూల్ ను ఫాలో అవుతున్నారు. పోలీసులు కనిపించారంటే బండిదిగి తోసుకుంటూ వెళ్ళాలి .. అప్పుడే ఫైన్ పడుకుంటా ఉంటుంది.  ఇటీవల ఇలా తోసుకుంటూ వెళ్తున్న వ్యక్తులు చాలామంది పోలీసుల కంటికి కనిపించారు.  ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో బండ్లను తోసుకుంటూ వెళ్తున్నారు.  అన్ని కరెక్ట్ గా ఉంటె ఇలా తోసుకుంటూ వెళ్లడం ఎందుకు అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  ఇకపోతే, పోలీసులు ఆపి చెక్ చేసి ఫైన్ వేశారని ఓ వ్యక్తి ఏకంగా బండిని తగలబెట్టేశాడు.  దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు ఫైల్ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: