వంగవీటి ఈ పేరుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక చరిత్ర ఉంది. అప్పట్లో రాజకీయాన్ని ఈ కుటుంబం తన కనుసన్నల్లో నడిపేది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ కుటుంబం చిన్న చిన్నగా లైమ్ లైట్ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. దీనికి నిదర్శనమే వంగవీటి వారసుడు ...మాజీ ఎమ్మెల్యే వంగవీరి రాధా ప్రస్తుతం తన పరిస్థితి ఏంటో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.

టీడీపీ నాయకుడు వంగవీటి రాధా ఎన్నికల ముందు వైసీపీ నుండి బయటకు వచ్చే సమయంలో ముందు జనసేనలోనే చేరతారని అందరూ భావించారు . కానీ రాధా అప్పుడు జనసేన లో  చేరలేదు .అనూహ్యంగా మళ్ళీ  టీడీపీలో చేరారు. ఇక తాజాగా టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో ఆయన పవన్ పార్టీ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

వంగవీటి రాధా.. వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో వైసీపీ అధినేత తీరుతో పార్టీ మారి టీడీపీలో చేరారు. ఇక ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రావటంతో వంగవీటి పరిస్థితి మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. టీడీపీ అధికారంలోకి వస్తే ఏదైనా పదవి లభిస్తుంది అనుకున్న రాధా కి నిరాశే ఎదురైంది. అలాగే ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. దీనితో రాధా కూడా తన దారి తాను చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. 

ఇక మొన్న జరిగిన  ఎన్నికల్లో పరాభవం నుంచి కోలుకున్న జనసేన అధినేత ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం  చురుగ్గా పాల్గొంటున్నాడు. జనసేనలో కూడా ప్రస్తుతం ఆ జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వంగవీటి వారసుడు ఆ పార్టీ పట్ల ఆకర్షితుడవుతున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడలో నిర్వహించిన టీడీపీ జనరల్ బాడీ సమావేశానికి రాధా రాకపోవడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటికి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది.  తూర్పు గోదావరి జిల్లా దిండిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వంగవీటి రాధా కలవడం రాజకీయవర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది . దిండిలోని రిసార్ట్స్‌లో జరుగుతున్న జనసేన సమావేశాలకు హాజరైన వంగవీటి రాధా వెళ్ళి పవన్ కళ్యాణ్‌ను కలిశారు. గతంలో కూడా అయన పవన్ తో భేటీలో పాల్గొన్నాడు. కానీ , అప్పుడు రాధా జనసేన లో చేరలేదు. చూడాలి మరి ఎప్పుడైనా చేరతారో లేదో .. 


మరింత సమాచారం తెలుసుకోండి: