జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత ఆ రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నది.  రెండు నెలల కాలంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  దానికి తగ్గట్టుగానే కేంద్రం అడుగులు వేస్తున్నది.  తాజగా కేంద్రం జమ్మూ కాశ్మీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ నిర్ణయంతో అక్కడ అభివృద్ధి పరుగులు తీయడమే కాదు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీల నిర్మాణానానికి, ఉద్యోగాల కల్పనకు చకచకా అడుగులు పడతాయి అనడంలో సందేహం అవసరం లేదు.  


జమ్మూ కాశ్మీర్, లడక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తరువాత కేంద్రం తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఆ రాష్ట్రాన్ని ఏడేళ్లపాటు టాక్స్ ఫ్రీగా మార్చడం.  ఇకపై అక్కడ ఏడేళ్లపాటు టాక్స్ ఉండదు.  టాక్స్ లేకుంటే అక్కడ ధరలు తెగ్గిపోతాయి.  తక్కువ ధరలకే అన్ని వస్తువులు దొరుకుతాయి. అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు 7 వ వేతన సంఘం సిఫార్సుల మేరకు అన్ని రాష్ట్రాల్లో ఉండే జీతభత్యాలను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోను అమలు జరుగుతాయి.  వాళ్లతో సమానంగా జీతాలు అందుకోబోతున్నారు. 


విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నారు.  3 నుంచి 5 ప్రభుత్వరంగ సంస్థలను జమ్మూ కాశ్మీర్ లో ఏర్పాటు చేయబోతున్నారు.  తద్వారా ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది.  కార్పొరేట్ హాస్పిటల్స్, విద్యాసంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  14 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలకు ఉచిత విద్యను అందించబోతున్నారు.  ఇది మంచి విషయంగా పేర్కొనాలి.  అలానే లడక్ లో ప్రతి గ్రామంలో 5 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటుగా అక్కడ సౌరవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది.  ఇవన్నీ అమలు జరిగితే జమ్మూ కాశ్మీర్ రెండేళ్లలో అన్ని రాష్ట్రాలకంటే మెరుగ్గా అభివృద్ధి సాధిస్తుంది అనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: