చంద్రయాన్ -2 ప్రస్తుతం మన దేశం లో ప్రతి ఒక్కరు  ఏ విషయం మీద చర్చించు కుంటున్నారు. అయితే చంద్రయాన్ -2 చంద్రుడి ఉపరితలానికి 2.  కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ్ ల్యాండర్ పయనం అక్కడ కుదుపునకు లోనై లాండర్ నుంచి ఇస్రో స్టేషన్స్ కు సిగ్నల్ నిలిచిపోయిన సంగతి విదితమే.దేశం గర్వించదగ్గ క్షణాలు 2. 1 కిలోమీటర్ల దూరం లో ఆవిరి అయ్యిపోయినందు వల్ల దేశం లోని ప్రతి ఒక్కరు బాధపడిన విషయం. 


ఇలాంటి సందర్భం లో బారత్ ను  రెచ్చగొడుతూ పాకిస్తాన్ సైన్స్ మంత్రి  ఫవాద్ చౌదరి  ట్విట్టర్ లో చంద్రయాన్ -2 ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ  వ్యాఖ్యల ఫై భారత నెటిజనులు గట్టిగా సమాధానం చెప్పారు. అయితే  ఎంత ట్రోల్ చేసిన వెనక్కి తగ్గని ఫవాద్ తరువాత ఇస్రో స్టేషన్ మీద భారత  ప్రధాన మంత్రి అయినా  నరేంద్ర మోదీ ఫై కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే నెటిజెన్ ఒకరు ఫవాద్ ను ఉద్దేశించి ''చంద్రయాన్ -2 లో ఆశ్చర్యం కలిగే విషయం  ఏమిటి అంటే అది రాత్రంతా ఫవాద్ ని నిద్ర లేకుండా చేసింది'' అని ఒక నెటిజెన్ ట్రోల్ చేసారు. 


 చేతకాకపోతే కామ్ గా కూర్చొవాలిగాని ఇలా చేయడం ఎందుకని, భారత్ లాంటి పేదదేశం రూ. 900 కోట్ల రూపాయలను చంద్రయాన్ పేరుతో తగలేసిందని పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ట్విట్టర్లో పేర్కొన్నాడు.  దీంతో నెటిజన్లు ఆయనపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఎవరూ చేయని సాహసం ఇండియా చేసింది.  మార్స్ మీదకు ఉపగ్రహాలను పంపుతున్నది.  దేశవిదేశాలకు చెందిన ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెడుతున్నది.  భారత్ చేస్తున్న ప్రయోగాలను మెచ్చుకోవాలి లేందంటే సైలెంట్ గా ఉండాలని నెటిజన్లు పేర్కొన్నారు.  ఇండియా నుంచే కాదు అటు పాక్ నెటిజన్లు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ ను చివాట్లు పెడుతున్నారు. 


అయినా, ఫవాద్‌ ఏమాత్రం వెనుకకు తగ్గలేదు. ఆ తర్వాత కూడా ఇస్రోపై, భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ ట్వీట్లు పెట్టారు. చంద్రాయన్‌-2 వైఫల్యానికి తానే కారణమైనట్టు ఇండియన్‌ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారని, చంద్రాయన్‌ బొమ్మ మూన్‌పైన కాకుండా ముంబైలో ల్యాండ్‌ అయిందని ఎద్దేవా వ్యాఖ్యలు చేశారు. మోదీ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ మీద ప్రసంగాలు చేస్తున్నారని, ఆయన నిజానికి పొలిటిషియన్‌ కాకుండా ఆస్ట్రోనాట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరుపేద దేశానికి చెందిన రూ. 900 కోట్లు వృథా చేయడంపై లోక్‌సభలో మోదీని ప్రతిపక్షాలు నిలదీయాలని ఫవాద్‌ అక్కసు వెళ్లగక్కారు. అల్పులు పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తున్నారని గత ఏడాది పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలు చేశారని, ఫవాద్‌ తీరు చూస్తే అది నిజమేనని అనిపిస్తోందని నెటిజన్లు చమత్కరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: