వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలిసిందే. ఈ ఉద్యోగాల కొరకు ఆగస్టు నెలలో 21.69 లక్షల ధరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 1 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు జరుగుతున్నాయి. కేటగిరీ - 1, డిజిటల్ అసిస్టెంట్ ప్రశ్న పత్రాల్లో రెండు ప్రశ్నలు తప్పుగా వచ్చినట్లు తెలుస్తోంది.ఈ రెండు పరీక్షలు రాసిన అభ్యర్థులకు రెండు మార్కులు కలపాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. 
 
ఈ నెల 1 వ తేదీ ఉదయం కేటగిరీ - 1 రాత పరీక్ష జరిగింది. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ - 5, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, మహిళా పోలీస్ ఉద్యోగాలకు ఒకే పరీక్షను నిర్వహించారు. ఏ సీరీస్ ప్రశ్నపత్రంలో 47, 98 బీ సిరీస్ ప్రశ్న పత్రంలో 30, 84 సీ సిరీస్ ప్రశ్నపత్రంలో 13, 147 డీ సిరీస్ ప్రశ్నపత్రంలో 3, 118 ప్రశ్నలకు పూర్తి మార్కులు కలుపుతున్నారని తెలుస్తోంది. కేటగిరీ - 1 లోని ఒక ప్రశ్నకు ఫైనల్ కీలో జవాబును మార్చారని తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ 1 వ తేదీ మధ్యాహ్నం జరిగిన డిజిటల్ అసిస్టెంట్ పరీక్షలో రెండు ప్రశ్నలలో తప్పులు దొర్లటంతో పరీక్షకు హాజరయిన వారందరికీ 2 మార్కులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాల ఆధారంగా 7 ప్రశ్నల జవాబులను ఫైనల్ కీ లో మార్చినట్లు తెలుస్తోంది. ఈ 7 ప్రశ్నల్లో 5 ప్రశ్నలకు రెండు జవాబులు ఉన్నట్లు అధికారులు గుర్తించటంతో రెండు జవాబుల్లో ఏది జవాబుగా పేర్కొన్నా మార్కులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు 86.63 శాతం మంది హాజరయినట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: